Andhra Pradesh : ఏపీలో రేపటి నుంచి కులగణన.. ఇంటింటి సర్వేకు శ్రీకారం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సంచలన నిర్ణయం మేరకు కులగణన ప్రక్రియకు ముహుర్తం ఖరారైంది. ఈ మేరకు నవంబర్ 15న, ప్రారంభం కానుంది.
ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు ప్రయోగాత్మకంగా కులగణన జరగనుంది. ఇదే సమయంలో ఏపీలో సమగ్ర కులగణన కోసం గత ఎనిమిది నెలలుగా ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది.
దీంతో ఆరుగురు అధికారులతో కూడిన కమిటీ దేశంలో కులగణన చేపట్టిన రాష్ట్రాల్లో ఇటీవలే పర్యటించారు. కులగణేన అంశంలో వచ్చే న్యాయపరమైన ఇబ్బందులను పరిగణలోకి తీసుకున్నారు.
అనంతరం ఆయా విషయాలను క్రోడీకరించి కులగణన ఎలా చేపట్టాలి, ఏ సమాచారం తీసుకోవాలన్న అంశం మేరకు సదరు కమిటీ, ఇప్పటికే సర్కారుకు రిపోర్టు సమర్పించింది.
details
కోటి 60 లక్షల కుటుంబాలకు సర్వే
తాజాగా ఈ నివేదిక ఆధారంగానే రాష్ట్రంలోని కోటి 60 లక్షల కుటుంబాలను ప్రభుత్వం సర్వే చేయనుంది.
ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా కులగణన ప్రక్రియ మొదలుకానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా ఈ కులగణనను ప్రారంభించనున్నారు.
ఇంటింటికి, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వెళ్లి డేటా సేకరించనున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం ఓ స్పెషల్ యాప్ తీసుకొచ్చింది.
ఈ డాటా మొత్తాన్ని డిజిటల్ పద్ధతిలో యాప్ లోనే క్రోడీకరిస్తారు. నవంబర్ 15న మూడు గ్రామ సచివాలయాలు, రెండు వార్డు సచివాలయాల పరిధిలో ప్రారంభం కానుంది.
details
ఈనెల 17న రాజమహేంద్రవరం, కర్నూలులో సర్వే
ఈ మేరకు కులగణన ప్రక్రియను జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పర్యవేక్షించనున్నారు. ఈనెల 22 వరకు కులగణన ప్రక్రియపై శిక్షణ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కులగణనపై ఐదు పట్టణాల్లో ప్రాంతీయ సదస్సులు సైతం నిర్వహించనున్నారు. రేపటి నుంచి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాలు జరుగనున్నాయి.
దీనికి సంబంధించి ప్రాంతీయ సదస్సులను ఈనెల 17న రాజమహేంద్రవరం, కర్నూలులో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వీటితో పాటు ఈ నెల 20న విశాఖపట్నం, విజయవాడలో, 24న తిరుపతిలోనూ నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నారు.