Page Loader
ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్
ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్

ఆంధ్రప్రదేశ్: ఆళ్లగడ్డలో భూమా అఖిల ప్రియ అరెస్ట్

వ్రాసిన వారు Stalin
May 17, 2023
11:35 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి ఘటనలో భూమా అఖిల ప్రియ, ఆమె భర్తతో పాటు అనుచరులను నంద్యాల పోలీసులు ఆళ్లగడ్డలో మంగళవారం అరెస్ట్ చేశారు. అరెస్టు చేసిన అనంతరం భూమా అఖిల ప్రియను నంద్యాల పోలీస్ స్టేషన్‌కు తరలించారు. నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ అనుచరులు అదే పార్టీకి చెందిన సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంగతి తెలిసిందే. టీడీపీ నేత లోకేష్ పాదయాత్ర సందర్భంగా మంగళవారం నంద్యాల మండలం కొత్తపల్లె గ్రామంలో జరిగిన ఈ ఘటనలో సుబ్బారెడ్డి గాయపడ్డారు. ప్రస్తుతం నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సుబ్బారెడ్డిపై దాడి దృశ్యాలు