Andhrapradesh: పింఛన్ దారులకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్.. బదిలీ చేసుకోవాలనుకునేవారికి ఛాన్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల పింఛన్లకు సంబంధించిన కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది. తాజాగా పింఛన్లు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేసుకునే అవకాశాన్ని అందించినట్లు తెలిపారు. దీనికి సంబంధించి, ప్రస్తుతం పింఛన్ తీసుకుంటున్న సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పింఛన్ బదిలీకి దరఖాస్తు చేసేటప్పుడు, పింఛన్ ఐడీ, బదిలీ చేయాలనుకునే ప్రాంతానికి సంబంధించిన జిల్లా, మండలం, సచివాలయం పేరు,అలాగే ఆధార్ జిరాక్స్ అవసరం అవుతుంది. ఈ సదుపాయం ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. స్వగ్రామాలకు రాలేని పింఛన్ గ్రాహకులు తమ ప్రస్తుత నివాస ప్రాంతానికి బదిలీ చేసుకోవడం ద్వారా పింఛన్ల పంపిణీకి సహాయపడుతుంది. ఈ ఆప్షన్ ప్రతినెలా అందుబాటులో ఉంటుందని, దీన్ని ఉపయోగించుకోవడం వల్ల స్వగ్రామాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.
ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ
ఈ నెల పింఛన్ల పంపిణీ ఒక్కరోజు ముందుగానే ప్రారంభించారు. సాధారణంగా ప్రతి నెలా ఒకటో తేదీన పంపిణీ జరుగుతుంటుంది, కానీ సెప్టెంబర్ 1 ఆదివారం కావడంతో, ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ఒకరోజు ముందుగానే చేపట్టింది. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులు,సచివాలయ ఉద్యోగులకు సెలవు కావడంతో, పింఛన్ల పంపిణీ నిర్వహించారు. అయితే శనివారం తీవ్ర వర్షాలు కారణంగా కొంత వెసులుబాటు చోటుచేసుకుంది. ఈ నెలలో వర్షాల వల్ల కొన్ని ప్రాంతాలలో పింఛన్ల పంపిణీ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విజయవాడ వంటి ప్రాంతాల్లో వరదల కారణంగా పింఛన్ల పంపిణీ నిలిచిపోయినట్లు తెలుస్తోంది. వీరికి వచ్చే నెలలో కలిపి పింఛన్ ఇస్తారా.. ఈ నెలలోనే అందిస్తారా అన్నది క్లారిటీ లేదు. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.