Andhra Pradesh: పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం విశాఖలోని సచివాలయాల నుంచి నగదు విత్‌డ్రా చేసి ఇంటింటికీ పంపిణీ చేసేందుకు వార్డు కార్యదర్శులకు అందజేయనున్నారు. ప్రతి పెన్షనర్‌కు రూ. 4,000, ఏప్రిల్, మే, జూన్ నెలల బకాయిలతో కలిపి మొత్తం రూ. 7,000.
రేపు ఫించన్ పంపిణీకి ఏర్పాట్లు ఆరంభం
రాష్ట్రంలోని ఫించన్ దారులందరికీ రేపు పంపిణీ చేయటానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఒక్క గ్రేటర్ విశాఖ పరిధిలో 1,46,930 మంది పెన్షనర్లకు 100.91 కోట్లు పంపిణీ చేయనున్నారు. జులై 1న పింఛన్ల పంపిణీ ప్రారంభమవుతుందని, వార్డు కార్యదర్శులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నిధులు అందజేస్తారన్నారని అధికారులు చెప్పారు. పంపిణీకి అవసరమైన మొత్తాన్ని ముందుగానే లెక్కించామని, ఆదివారం బ్యాంకులకు సెలవు కావడంతో ముందు జాగ్రత్తగా పై అధికారులు కింది స్ధాయి సిబ్బందిని ఆదేశించారు. ఈ మేరకు శనివారం బ్యాంకుల నుంచి అవసరమైన నిధులను విత్‌డ్రా చేసి ట్రెజరీలో వుంచారు.