AndhraPradesh: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ ఫీజులపై హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులు హైకోర్టు (Highcourt) కీలక తీర్పు ఇచ్చింది. ఫీజు నియంత్రణ మండలి ఇంజనీరింగ్ కళాశాలలకు ఖరారు చేసిన ఫీజుల ప్రక్రియను ధర్మానసం కొట్టివేసింది. కళాశాలల ఖర్చుల్లో భాగంగా విధించిన పరిమితులు అసలు చెల్లవని హైకోర్టు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించడం కోసమే నియంత్రణ మండలి ఈ చట్ట వ్యతిరేక ప్రక్రియను చేపట్టినట్లు వివరించింది. చట్ట ప్రకారంగా మళ్లీ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజుల(engineering fees)ను ఖరారు చేయాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, రెగ్యులేటరీ కమిషన్ తరపున సుదేశ్ ఆనంద్ వాదనలు వినిపించారు.