Page Loader
Anna canteens: ఏపీలో రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం
ఏపీలో రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

Anna canteens: ఏపీలో రేపు మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2024
09:09 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. రేపు (గురువారం) 75 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభించనుంది. ఈ రెండో విడత క్యాంటీన్లను సీఎం చంద్రబాబు నాయుడు తన చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. మొదటి విడతలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించిన విషయం విదితమే. మొత్తం 203 అన్న క్యాంటీన్లు ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది, దీని కోసం అధికారులు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపటి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని కొత్త క్యాంటీన్లను ప్రారంభించనున్నారు.

వివరాలు 

 రూ.15కే మూడు పూటల భోజనం 

ఈ సారి విశాఖ నగర పరిధిలో 25 క్యాంటీన్లు ప్రారంభించబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా మొదటి విడతలో అక్కడ క్యాంటీన్లు ఏర్పాటు చేయలేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లు పేదల ఆకలి తీర్చడంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఈ క్యాంటీన్లలో ప్రభుత్వం కేవలం రూ.15కే మూడు పూటలు భోజనం అందిస్తోంది. ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం లంచ్‌, రాత్రి డిన్నర్ అందించాలన్న లక్ష్యంతో చంద్రబాబు సర్కారు ఈ అన్న క్యాంటీన్లను ప్రారంభించింది.