
Assam: భార్యకు టికెట్ రాలేదని.. కాంగ్రెస్‌ను వీడిన అసోం ఎమ్మెల్యే
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ప్రత్యర్థులను ఓడించేందుకు ఎంపిక చేసి టిక్కెట్లు ఇస్తున్నారు.
అదే సమయంలో టిక్కెట్ రాకపోవడంతో కొంత మందిలో ఆగ్రహం కూడా కనిపిస్తోంది.
అసోంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. లఖింపూర్ జిల్లాలోని నవోబోయిచా ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా, తన భార్యకు లోక్‌సభ సీటు ఇవ్వలేదని హస్తం పార్టీకి రాజీనామా చేశారు.
తన సతీమణి రాణికి పార్టీ తప్పకుండా టికెట్ ఇస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే లఖింపూర్ లోక్‌సభ స్థానం నుంచి ఉదయ్‌శంకర్ హజారికాకు టికెట్ ఇవ్వడంతో ఆగ్రహం చెందిన భరత్ నారా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
Details
ఎమ్మెల్యే భరత్ నారా కాంగ్రెస్‌కు రాజీనామా
సోమవారం, భరత్ నారా కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు ఎమ్మెల్యే లేఖ రాశారు.
తక్షణమే తాను భారత జాతీయ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు అందులో రాశారు. అంతకుముందు ఆదివారం ఆయన అస్సాం కాంగ్రెస్ మీడియా సెల్ అధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారు.
భరత్ నారా రాజీనామా కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆ పార్టీ మళ్లీ నిలదొక్కుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
ఇంతకు ముందు కూడా చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
Details
ఖింపూర్ నుంచి మూడుసార్లు రాణి నారా
భరత్ నారా ఐదుసార్లు ఢకుఖానా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021లో ఆరోసారి నవోబోయిచా నుంచి ఎమ్మెల్యే అయ్యారు.
కాంగ్రెస్‌లో చేరడానికి ముందు భారత్ అస్సాం గణ పరిషత్ (ఏజీపీ)లో ఉన్నారు.
అయన AGP, కాంగ్రెస్ ప్రభుత్వాలలో క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన భార్య రాణి నారా మూడుసార్లు లఖింపూర్ నుంచి ఎంపీగా ఉన్నారు.
అయితే ఈసారి పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రదాన్ బారువాపై ఉదయ్ శంకర్ హజారికా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.
లఖింపూర్ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 14 లోక్‌సభ స్థానాలకు గాను 13 స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టడం గమనార్హం.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అసోంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్
ANOTHER BLOW TO CONGRESS
— My India Story (@myindiastory) March 25, 2024
Assam Congress MLA Bharat Chandra Narah has submitted his resignation from the party.#Assam pic.twitter.com/W3CqgdYmzL