
India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది.
భవిష్యత్తులో దేశంపై జరిగే ఏ ఉగ్రవాద దాడినైనా యుద్ధ చర్యగానే పరిగణించి, అదే స్థాయిలో తగిన ప్రతిచర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ మేరకు ప్రభుత్వం సుదీర్ఘంగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి.
ఈ నిర్ణయం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశంలో తీసుకున్నారు.
ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) అనిల్ చౌహాన్, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.
Details
చిన్న ఘటనలు జరిగినా యుద్ధంగానే భావిస్తాం
ఈ సమావేశంలో దేశ భద్రత, సరిహద్దు పరిస్థితులు, పాకిస్థాన్ చర్యలు, ఉగ్రవాద ముప్పు తదితర అంశాలపై చర్చించారు.
ఇకపై ఉగ్రదాడులు చిన్న ఘటనలుగా పరిగణించకుండా, దేశం మీద యుద్ధానికి సమానంగా చూస్తామని భారత్ సంకేతాలు పంపింది.
ఈ నేపథ్యంలో భవిష్యత్తులో భారత్‌కు ఎదురయ్యే ఎలాంటి ఉగ్రవాద దాడినైనా ఆర్మీ సమర్థవంతంగా, శక్తివంతంగా తిప్పికొట్టనుంది.
ఇది భారత్ తీసుకున్న సమయోచిత నిర్ణయమని దేశవ్యాప్తంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.