Chandrababu: వరద ప్రాంతాలలో కరెంటు బిల్లులపై కీలక ప్రకటన చేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాలలో కరెంటు బిల్లుల వసూళ్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన, వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంటు బిల్లుల వసూలు వాయిదా వేయాలని నిర్ణయించామన్నారు. వరద వల్ల నష్టపోయిన వస్తువుల మరమ్మత్తుకు సరైన ధరలను ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. వాహనాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గ్యాస్ స్టవ్‌ల మరమ్మత్తుల కోసం కూడా ప్రభుత్వమే ఒక ధర నిర్ణయిస్తుందని తెలిపారు. ఆన్‌లైన్‌లో ఇటువంటి సేవలు అందించేవారితో కూడా మాట్లాడుతున్నట్లు చెప్పారు.
వరద బాధితులకు కిట్లు
నేటి నుండి మూడు రోజులు, రోజుకు 80,000 మందికి నూడుల్స్ ప్యాకెట్లు, ఆరు యాపిల్స్, ఆరు బిస్కట్లు, పాలు, వాటర్ బాటిళ్లను అందించనున్నట్లు ప్రకటించారు. చౌకగా కూరగాయలు అందించే ఏర్పాట్లను కూడా చేస్తామన్నారు. వరద బాధితులకు కూరగాయల ధరలను రూ.2, రూ.5, రూ.10కు అందిస్తామని, ఒక్కో ఇంటికి 25 కిలోల బియ్యం, లీటర్ పామాయిల్, కిలో పప్పుతో కిట్లు అందిస్తామని వెల్లడించారు. అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటామన్నారు. 20కి పైగా సెల్‌ఫోన్ టవర్ల పునరుద్ధరణపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజల అభిప్రాయాలను కూడా తీసుకుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండగా ఉంటుంది: శివరాజ్‌సింగ్ చౌహాన్
కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అండగా ఉంటుందని చెప్పారు. ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, కేంద్రం అవసరమైన సహకారాన్ని అందిస్తుందన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం,1.8లక్షలహెక్టార్లలో పంట దెబ్బతిందని.. 2లక్షల మంది రైతులు నష్టపోయారని ఆయన తెలిపారు. నిపుణుల బృందాలు వరద నష్టాన్ని అధ్యయనం చేస్తున్నాయి,పూర్తి అంచనా తీసుకున్న తర్వాత కేంద్రం తక్షణ,దీర్ఘకాలిక సాయం అందిస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ చర్యలు వేగంగా,సమర్థంగా ఉంటే ప్రాణనష్టం తగ్గుతుందని డ్రోన్ల ద్వారా పాలు, మంచినీళ్లు, ఆహారం అందజేయడం మొదటిసారిగా చూస్తున్నట్లు చెప్పారు. ప్రధాని, కేంద్ర హోమ మంత్రి పంపించిన ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు,వాయుసేన,నౌకాదళం హెలికాప్టర్లు కూడా సహాయం అందించాయన్నారు. కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తోందన్నారు.