Page Loader
Chandrababu: కార్మికులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌ న్యూస్.. కార్మికులకు రూ.10లక్షల బీమా
కార్మికులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌ న్యూస్

Chandrababu: కార్మికులకు చంద్రబాబు సర్కార్ గుడ్‌ న్యూస్.. కార్మికులకు రూ.10లక్షల బీమా

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 29, 2024
05:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్మికుల సంక్షేమేమే కూటమి ప్రభుత్వ ప్రధాన విధానమని పేర్కొన్నారు. కార్మికుల హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని,పరిశ్రమలు అనవసరమైన నిబంధనలతో వేధింపులకు గురి కాకూడదని అభిప్రాయపడ్డారు. కార్మిక శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం,భద్రత అంశంలో రాజీ పడొద్దని అధికారులకు కీలక సూచనలు చేశారు. ఫ్యాక్టరీల భద్రతా ప్రమాణాలను పరీక్షించేందుకు థర్డ్‌ పార్టీ ద్వారా ఆడిట్‌ నిర్వహించాలని ఆదేశించారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తామని,రాష్ట్రం నుంచి అవసరమైన నిధులు విడుదల చేస్తామని తెలిపారు. 2019కు ముందు అమల్లో ఉన్న చంద్రన్నబీమాను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పరిహారం తగ్గించడంతో పాటు లబ్ధిదారులను కూడా ఆంక్షలతో తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరలోనే రూ.10లక్షల బీమాను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.