Visakhapatnam: విశాఖలో వైసీపీ భూ అక్రమాలపై కొరడా.. హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ ప్రభుత్వ పాలనలో విశాఖలో జరిగిన భారీ భూ కుంభకోణాలు, అక్రమ భూ ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది.
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హయగ్రీవ ఫార్మ్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు విశాఖలోని ఎండాడలో కేటాయించిన 12.51 ఎకరాల భూమిని ప్రస్తుతం రద్దు చేసింది.
ఈ భూమికి ప్రస్తుత విలువ రూ. 250 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.
వృద్ధాశ్రమం,అనాథ శరణాలయం నిర్మిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి రాయితీపై భూమిని పొందిన హయగ్రీవ సంస్థ,అసలు ప్రాజెక్టును ప్రారంభించకుండా అనేక అక్రమాలకు పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు.
స్థిరాస్తి వ్యాపారం నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించినట్టు స్పష్టమైంది.
దీంతో,భూమిని ప్రభుత్వానికి తిరిగి అప్పగించి,ప్రజావసరాల కోసం ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు.
వివరాలు
భారీ కుంభకోణంలో కీలక నేతల పాత్ర
ఈ మేరకు భూపరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) ఆర్పీ సిసోదియా విశాఖ జిల్లా కలెక్టర్‌కు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ భూ కుంభకోణంలో వైకాపా నేత, విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, అలాగే మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడైన ఆడిటర్ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) కీలక పాత్ర పోషించినట్టు స్పష్టమైంది.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసి, హయగ్రీవ ప్రాజెక్టు అసలు యజమాని చిలుకూరి జగదీశ్వరుడు, మేనేజింగ్ పార్ట్‌నర్ గద్దె బ్రహ్మాజీ, ఇతరుల ఆస్తులను కూడా జప్తు చేసింది.
మొత్తం రూ. 44.74 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది.
వివరాలు
హయగ్రీవ భూకుంభకోణం - మోసం, కుట్రలు
వైఎస్ హయాంలో మొదలై,జగన్ పాలనలోనూ కొనసాగిన హయగ్రీవ భూ కుంభకోణంలో అడుగడుగునా వైకాపా నేతల మోసం, కుట్రలు బయటపడ్డాయి. కూటమి ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఈ అంశాలను స్పష్టంగా పేర్కొంది.
గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ మదనపల్లె ఎక్స్-సర్వీస్‌మెన్ అసోసియేషన్ కేసులో హైకోర్టు తీర్పును ఆధారంగా తీసుకుని,హయగ్రీవ భూకేటాయింపులను రద్దు చేసినట్లు పేర్కొంది.
వృద్ధుల కోసం భూమి కేటాయింపు - అక్రమ దందాలు
2006లో హయగ్రీవ సంస్థ విశాఖలో భూమిని దరఖాస్తు చేయగా,అప్పటి జిల్లా కలెక్టర్ ఎకరం రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించాలని సిఫారసు చేశారు.
అయితే,వృద్ధాశ్రమం,అనాథ శరణాలయం నిర్మిస్తామని చెప్పి, 2008 జూన్ 12న వైఎస్ ప్రభుత్వం రాయితీగా రూ.45లక్షల చొప్పున 12.51 ఎకరాల భూమిని కేటాయించింది.
వివరాలు
నిబంధనల ప్రకారం:
10% భూమిలో వృద్ధాశ్రమం, అనాథ శరణాలయం నిర్మించాలి.
60% భూమిలో వృద్ధుల కోసం కాటేజీలు నిర్మించి, 60 ఏళ్లు పైబడిన వారికి విక్రయించాలి.
30% భూమిని మౌలిక వసతుల కోసం వినియోగించాలి.
కానీ, హయగ్రీవ సంస్థ అసలు నిర్మాణాలు చేపట్టలేదు. ఏది చేయకుండా కోర్టుకెళ్లి, లాయర్లు పెట్టి, ప్రాజెక్టును ఆలస్యానికి గురిచేసింది.
ఎంవీవీ, జీవీ దృష్టి హయగ్రీవ భూములపై
వైకాపా అధికారంలోకి వచ్చాక, వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ భూమిపై దృష్టిపెట్టారు.
చిలుకూరి జగదీశ్వరుడిపై ఒత్తిడి తెచ్చి, గద్దె బ్రహ్మాజీ అనే వ్యక్తిని ప్రాజెక్టులో భాగస్వామిగా చేర్చారు.
ఆయనకు 75% వాటా ఇచ్చేలా ఒత్తిడి చేశారు. ఆ తర్వాత, బ్రహ్మాజీ హయగ్రీవ భూమిని జీవీకి బదలాయించాడు.
వివరాలు
అక్రమ విక్రయాలు
36,329 చ. గజాల భూమిలో 32,857 గజాలను ప్లాట్లుగా విభజించి విక్రయించారు.
జగదీశ్వరుడు 2021 డిసెంబర్‌లో ఒక వీడియో విడుదల చేసి, తనను భయపెట్టి ఎంవీవీ, జీవీ భూమిని లాక్కున్నారని ఆరోపించారు.
తర్వాత, వారంతా మళ్లీ కలిసిపోయి అక్రమ దందా కొనసాగించారు.
కలెక్టర్‌తోనే హయగ్రీవ సంస్థకు అనుమతులు
2022 జనవరి 4న జిల్లా కలెక్టర్ మల్లికార్జున, హయగ్రీవ భూమి కేటాయింపును రద్దు చేయాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. కానీ, వైకాపా నేతలు అదే కలెక్టర్‌పై ఒత్తిడి తెచ్చి, హయగ్రీవ సంస్థకు గ్రీన్ సిగ్నల్ ఇప్పించారు.
2023 మే 3న జీవీఎంసీ అధికారులు, ఒక్క రోజులోనే హయగ్రీవ ప్రాజెక్టుకు తుది అనుమతులిచ్చేశారు.
వివరాలు
ఎంవీవీ, జీవీపై కేసులు - మనీలాండరింగ్ ఆరోపణలు
2024 జూన్‌లో చిలుకూరి జగదీశ్వరుడు మళ్లీ ఫిర్యాదు చేసి, 500 కోట్ల విలువైన భూములు అక్రమంగా లాక్కున్నారని ఆరోపించారు.
ED దర్యాప్తు:
2021-2022లో 30 కంటే ఎక్కువ సేల్ డీడ్‌లు, ఒప్పందాలు చేశారని నిర్ధారించింది.
రూ. 87.64 కోట్ల ఆదాయం ఎంవీవీ, బ్రహ్మాజీ, వారణాసి దిలీప్‌లకు చేరినట్లు తేలింది.
2011-2019 మధ్య జగదీశ్వరుడు కూడా 8 మందికి భూములు విక్రయించారని తేల్చింది.