ఆంధ్రప్రదేశ్ సర్కారు గుడ్ న్యూస్.. ఈనెల 15 నుంచి ఇంటింటికీ హెల్త్ సర్వే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి ఇంటింటికీ ఆరోగ్య సర్వేను చేపట్టబోతోంది.ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రకటన చేశారు. ఇంటింటికీ ఆరోగ్య సర్వేలో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్లు ప్రతీ ఇంటికెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలను నమోదు చేస్తారన్నారు. ఆయా డేటాను ఏఎన్ఎంలు, క్లస్టర్ స్థాయి ఆరోగ్య అధికారులకు అందిస్తామని, తద్వారా ఆరోగ్య సిబ్బంది ఇంటింటిని సందర్శించి పరీక్షలను చేస్తారన్నారు. సెప్టెంబర్ 30 నుంచి నిర్వహించనున్న జగనన్న ఆరోగ్య శిబిరాలకు రోగులకు టోకెన్లు కేటాయిస్తామన్నారు.అవసరం మేరకు ఆస్పత్రులకూ పంపిస్తామన్నారు. ఆరోగ్య శిబిరాల్లో రోగులకు చికిత్స నిమిత్తం వైద్య పరికరాలను అందుబాటులో ఉంచడం సహా 105 రకాల మందులను ఉచితంగా ఇస్తామన్నారు.
గడిచిన 4 ఏళ్లలో ఆరోగ్యశ్రీకి రూ.8,600 కోట్లు కేటాయించిన సీఎంకు ధన్యవాదాలు : రజినీ
Over the past four years, the state government under Hon'ble CM @ysjagan Anna has allocated ₹8,600 crore to the YSR Arogyasri scheme, with an average annual spend of about ₹2,200 crore. This marks a significant increase from the previous regime's ₹1,100 crore. The initiative...— Rajini Vidadala (@VidadalaRajini) September 8, 2023