LOADING...
AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..
ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..

AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 09, 2025
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకం పనుల నిమిత్తంగా రూ.176.35 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పనుల కోసం ఉపయోగించనుంది. ఈ నిధులను నిర్ణీత నిబంధనల ప్రకారం ఖర్చుచేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్‌కు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంపై పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు విడుదల చేశారు.

వివరాలు 

దినసరి వేతనంలో పెంపు 

ఉపాధి హామీ పథకం ద్వారా శ్రమించే కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు కీలక చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరావతిలో నిర్వహించిన ఉపాధి శ్రామికుల ఆత్మీయ సమ్మేళనంలో,ఉపాధి కార్మికుల వేతనాన్ని పెంచుతున్నట్టు ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు ఉన్న రోజువారి వేతనాన్ని రూ.307కి పెంచారు. కార్మికుల భద్రత విషయంలోనూ ప్రభుత్వం గణనీయమైన నిర్ణయం తీసుకుంది. ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్న కార్మికులు పనిస్థలంలో ప్రమాదవశాత్తు మరణించకున్నాలేదా శారీరక వికలాంగతకు గురైనా వారి కుటుంబాలకు బీమా పరిరక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఉన్న బీమా పరిధి రూ.50,000గా ఉన్నదాన్ని కూటమి ప్రభుత్వం రూ.4 లక్షల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది.