LOADING...
Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసు సీబీఐకి 
సుగాలి ప్రీతి కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసు సీబీఐకి

Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసు సీబీఐకి 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 03, 2025
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కర్నూలు జిల్లాకు చెందిన మైనర్‌ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ నిర్ణయించింది. ఈ విషయంలో మంగళవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష జరిపారు. కేసుపై వివరణాత్మక దర్యాప్తు చేపట్టేందుకు సీబీఐ అధికారులకు లేఖ రాయాలని సూచించారు. 2017 ఆగస్టు 18న, కర్నూలులోని ఒక పాఠశాల వసతీగృహంలో సుగాలి ప్రీతి సీలింగ్ ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించడం పెద్ద సంచలనానికి కారణమైంది. ఈ కేసును 2019లో వైసీపీ ప్రభుత్వం సీబీఐకు అప్పగించింది.అయితే దర్యాప్తు ఆరంభానికి 8 నెలలకుపైగా ఆలస్యం కావడం వలన,సుగాలి ప్రీతి తల్లిదండ్రులు 2020లో ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

వివరాలు 

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పురోగతి లేదు: సుగాలి ప్రీతి తల్లి

హైకోర్టు విచారణలో సీబీఐ తగిన వనరులు లేనందున కేసు దర్యాప్తు చేయలేమని సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు,ఇతరులు ఈ కేసుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ఈ కేసును ప్రచారానికి ఉపయోగించారని వారు పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే కేసును దర్యాప్తు చేయిస్తామని అధికారికంగా ప్రకటించినప్పటికీ, కూటమి ప్రభుత్వం పాలనలోకి వచ్చిన తర్వాత కూడా ఎలాంటి పురోగతీ లేదని పవన్ కల్యాణ్, సుగాలి ప్రీతి తల్లి తీవ్రంగా ఆరోపించారు. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించడం గమనార్హం.