Page Loader
New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం
కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

New tourism policy: కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 11, 2024
08:12 am

ఈ వార్తాకథనం ఏంటి

పర్యాటకరంగంలో పెద్దమొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానాన్ని ప్రవేశపెట్టింది. మంత్రివర్గం ఆమోదించిన ఈ విధానంపై మంగళవారం జీఓ విడుదలైంది. ఇందులో పారిశ్రామిక హోదాను కల్పించి, ఎంఎస్‌ఎంఈలకు అందించే రాయితీలను పర్యాటక రంగానికీ వర్తింపజేసారు. పీపీపీ విధానంలో తీరప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, సందర్శనీయ ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించి పెట్టుబడులను ఆహ్వానించారు. కొత్త విధానంలో స్టాంపు డ్యూటీ, భూముల బదిలీ సుంకాలపై పూర్తి మినహాయింపు, లీజు రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ మినహాయింపు, భూముల బదలాయింపునకు రుసుముల నుంచి మినహాయింపు, పారిశ్రామిక విద్యుత్తు టారిఫ్ వర్తింపజేయడం వంటి ఇతర రాయితీలు పొందుపరచబడ్డాయి.

వివరాలు 

ఐదేళ్లపాటు విద్యుత్తు సుంకం మినహాయింపు

ప్రాజెక్టు ప్రారంభం తర్వాత ఐదేళ్లపాటు విద్యుత్తు సుంకం మినహాయింపు, క్వాలిటీ సర్టిఫికేషన్‌కు జాతీయ స్థాయికి రూ.2 లక్షలు, అంతర్జాతీయ స్థాయికి రూ.10 లక్షల రాయితీ వర్తింపు వంటి ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. రూ.51 కోట్లు పైగా పెట్టుబడులకు ఈ రాయితీలు వర్తించవు. అలాగే, జీఎస్‌టీపై గరిష్ఠంగా మూలధన పెట్టుబడికి సమానమైన మినహాయింపులు అందిస్తారు. భారీ, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టుల కోసం 7 నుంచి 15 ఏళ్లపాటు జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తుందని పేర్కొంది. రూ. కోటి పెట్టుబడికి ఒక ఉపాధి నిష్పత్తి ఆధారంగా అదనపు ప్రోత్సాహకాలను కూడా ఇవ్వాలని ప్రస్తావించింది.