Page Loader
Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..
భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..

Bengaluru: భార్య వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సూసైడ్.. మగాళ్లకు అన్యాయం జరుగుతోందని ఆవేదన..

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2024
05:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో చోటుచేసుకున్న ఓ విచిత్రమైన సంఘటనలో 34 ఏళ్ల అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతుల్, బిహార్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, బెంగళూరులో మంజునాథ్ లేఅవుట్‌లో నివాసముంటున్నాడు. అతని ఆత్మహత్య అనంతరం, బెంగళూరు పోలీసులు సూసైడ్ నోట్‌ని కనుగొన్నారు. ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. నెటిజన్లు అతుల్‌కు న్యాయం చేయాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అతుల్ చివరిలో వదిలిన వీడియోలు, నోట్ ఆయన ఎదుర్కొన్న తీవ్రమైన మానసిక వేధింపులను వెల్లడిస్తున్నాయి. ఆయన ఆత్మహత్యకు ముందు ''న్యాయం జరగాలి'' అనే ప్లకార్డు స్వాధీనం చేసుకున్నారు.

వివరాలు 

తప్పుడు కేసులతో న్యాయవ్యవస్థ వేధించడంపై రాష్ట్రపతికి లేఖ

అతుల్ నుంచి విడిపోయిన భార్య, అతడి తల్లిదండ్రులపై తప్పుడు కేసు పెట్టిందని, దీంతో ఆయన మానసికంగా కుంగిపోయినట్లు సోదరుడు బికాస్ కుమార్ పోలీసులకు తెలిపారు. అతుల్ తన భార్య, ఉత్తర్ ప్రదేశ్ ఔన్‌పూర్ న్యాయమూర్తిపై కూడా వీడియోలో ఆరోపణలు చేశాడు. తప్పుడు కేసులతో న్యాయవ్యవస్థ వేధించడంపై ఆయన రాష్ట్రపతికి లేఖ రాశారు. మరో నోట్‌లో తన భార్య తనపై మోపిన అన్ని అభియోగాల్లో తాను నిర్దోషినని భార్య, అతడిపై వరకట్న నిషేధం, క్రూరత్వం వంటి కేసులు పెట్టిందని,ఈ తప్పుడు కేసుల్లో తన తల్లిదండ్రుల్ని, సోదరుడిని వేధించడం మానుకోవాలని కోర్టును కోరారు. 2019లో మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్ ద్వారా పెళ్లి చేసుకున్న తర్వాత, తన భార్య కుటుంబీకులు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేసేవారని అతుల్ ఆరోపించారు.

వివరాలు 

 న్యాయమూర్తి రూ. 5లక్షలు డిమాండ్  

డబ్బులు నిరాకరించడంతో 2021లో ఆమె బెంగళూరులో నుంచి పుట్టింటికి వెళ్లిపోవడం వంటి విషయాలు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.తరువాత,అతుల్‌పై తన భార్య,ఆమె కుటుంబం హత్య, అసహజ సెక్స్ వంటి అనేక తప్పుడు కేసులు పెట్టాయి. ఆయన,ఈ తప్పుడు కేసులను పరిష్కరించడంలో భార్య ,ఆమె కుటుంబం మొదట రూ. 1 కోటి, తర్వాత రూ.3కోట్లు డిమాండ్ చేశారని చెప్పారు.తన భార్య కోర్టులో నెలకు రూ.2లక్షలు డిమాండ్ చేసిందని చెప్పారు. కోర్టు విచారణ సందర్భంగా..తప్పుడు కేసులతో మగాళ్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని జడ్జికి చెప్పగా,తన భార్య'మీరేందుకు చేసుకోరు'అని చెప్పిందని,దీనికి జడ్జ్ నవ్వుతూ ఆమెని రూం నుంచి బయటకు వెళ్లమని చెప్పాడని,తన కుటుంబం గురించి ఆలోచించాలని న్యాయమూర్తి చెప్పాడని, కేసుని పరిష్కరించుకోవడానికి రూ. 5లక్షలు డిమాండ్ చేశాడని అతుల్ ఆరోపించారు.