
Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం..
ఈ వార్తాకథనం ఏంటి
తెల్ల రాయి అక్రమ రవాణాకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పై నమోదు చేసిన కేసులో, తొందరపాటు చర్యలు చేపట్టకుండా మద్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తేల్చి చెప్పింది.
ఈ కేసులో కాకాణి ఏ 4గా ఉన్నారు. పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చినా, కాకాణి సహకరించటం లేదని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసు కూడా నమోదు చేసినట్టు కోర్టులో మెమో ఫైల్ చేసింది.
అయితే, హైదరాబాద్‌లో ఉన్న కారణంగా పోలీసు విచారణకు హాజరు కాలేకపోయారని కాకాణి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.
పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఎల్లుండి వాయిదా వేసింది.
వివరాలు
తదుపరి విచారణను ఎల్లుండికి వాయిదా
అయితే, పోలీసులు రెండో నోటీసులు జారీ చేసిన తరువాత, వరుసగా రెండో రోజూ కూడా పోలీసు విచారణకు డుమ్మా కొట్టిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ముందస్తు బెయిల్ కోసం, మరోవైపు కేసు క్వాష్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టు, కాకాణిపై తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది.
పొదులుకూరు పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లు దాఖలు చేయగా, విచారణ జరిపి, తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసిన న్యాయస్థానం, వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఎల్లుండి వాయిదా వేసింది.