AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు.ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు.ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు. సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించింది. ఏపీ ఇంటర్ మొదటి, https://resultsbie.ap.gov.in రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలు లో చూడొచ్చు
ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షల తేదీలు
ఎలక్షన్ కోడ్ కారణంగా రాజకీయనాయకుల ప్రమేయం లేకుండా ఇంటర్‌బోర్డ్ ఉన్నతాధికారులే ఈసారి ఫలితాలు విడుదల చేస్తున్నారు. ఇక, పరీక్షా ఫలితాల రోజే ఇంప్రూమెంట్, సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించిన తేదీలను ప్రకటించనున్నారు. వాటి ఫీజు వివరాలు కూడా ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.