NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nara Lokesh: అమెరికాలో మంత్రి లోకేశ్‌ పర్యటన.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశం..
    తదుపరి వార్తా కథనం
    Nara Lokesh: అమెరికాలో మంత్రి లోకేశ్‌ పర్యటన.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశం..
    అమెరికాలో మంత్రి లోకేశ్‌ పర్యటన.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశం..

    Nara Lokesh: అమెరికాలో మంత్రి లోకేశ్‌ పర్యటన.. టెస్లా సీఎఫ్ఓ వైభవ్ తనేజాతో సమావేశం..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 28, 2024
    11:57 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేశ్, అక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు జరుపుతున్నారు.

    ఆయన రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరిస్తున్నారు.

    ఈ క్రమంలో, మంత్రి నారా లోకేష్ ఆస్టిన్‌లోని టెస్లా కేంద్ర కార్యాలయానికి వెళ్లారు.

    అంతర్జాతీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ రంగంలో ప్రముఖంగా ఉన్న టెస్లా, ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలపై టెస్లా CFO వైభవ్ తనేజాతో భేటీ అయ్యారు.

    వివరాలు 

    టెస్లా గత ఏడాది 18.8% వృద్ధి

    ఈ సమావేశంలో, CFO వైభవ్ తనేజా, ఎలక్ట్రిక్ వాహనాలు,క్లీన్ ఎనర్జీ పరిష్కారాలు,బ్యాటరీ స్టోరేజీలో తమ సంస్థ గ్లోబల్ లీడర్‌గా ఉందని చెప్పారు.

    ఇంటి నుండి గ్రిడ్ వరకు బ్యాటరీ పవర్ స్టోరేజీ పరికరాలు, సోలార్ ప్యానల్స్,సోలార్ షింగిల్స్,డ్రైవింగ్ ఇన్నోవేషన్, మోడల్-3,పవర్ వాల్ వంటి ఉత్పత్తుల ద్వారా టెస్లా ఇంధన రంగంలో స్థిరమైన వృద్ధి సాధించడం వంటి విషయాలను కూడా తెలియజేశారు.

    గత ఏడాది 18.8% వృద్ధి సాధించి 832 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో 97 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని పొందినట్లు ఆయన వివరించారు.

    ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్,విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడి నాయకత్వంలో 2029 నాటికి ఏపీలో 72 గిగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.

    వివరాలు 

    పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు 

    టెస్లా వంటి అగ్రశ్రేణి గ్లోబల్ కంపెనీల సహాయంతో ఈ లక్ష్యాన్ని సాధించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.

    గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆటోమొబైల్ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో కృషి చేసి, కియా, హీరో మోటార్స్ వంటి కంపెనీలను రాష్ట్రానికి తీసుకొచ్చారు.

    ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ రంగాలపై దృష్టి సారిస్తున్నారన్నారు.

    అంతేకాకుండా, అనంతపురం జిల్లాలో టెస్లా EV తయారీ, బ్యాటరీ ఉత్పత్తి యూనిట్ల ఏర్పాటుకు వ్యూహాత్మక ప్రదేశంగా మారనున్నదని చెప్పారు.

    ప్రగతిశీల నాయకత్వంలో పరిశ్రమలకు అనుకూలమైన విధానాలు ఏపీలో అమలవుతున్నాయని, రాష్ట్రవ్యాప్తంగా సౌరశక్తి నిల్వ వ్యవస్థలు, ముఖ్యంగా స్మార్ట్ నగరాలు, గ్రామీణ విద్యుదీకరణకు సౌర ఫలకాలను అమర్చడంలో భాగస్వామ్యం వహించాలని కోరారు.

    వివరాలు 

    ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్క్‌ల ఏర్పాటు 

    ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధించేందుకు రెన్యూబుల్ ఎనర్జీపై దృష్టి సారించాలని మంత్రి లోకేష్ కోరారు.

    రాష్ట్రంలో రాబోయే డేటా సెంటర్, IT హబ్‌లకు వినూత్న బ్యాటరీ పవర్ స్టోరేజీ పరిష్కారాలు అవసరమని, టెస్లా ఏపీకి వస్తే ఈ రంగంలో కీలక పాత్ర వహించడానికి అవకాశం ఉందని చెప్పారు.

    రాష్ట్రవ్యాప్తంగా EV ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం, సూపర్‌చార్జింగ్ టెక్నాలజీ అమలులో భాగస్వామ్యం వహించాలని కూడా విజ్ఞప్తి చేశారు.

    టెస్లా R&D, ఇన్నోవేషన్‌లో కీలక పాత్ర పోషిస్తూ, స్థిరమైన ఇంధన పరిష్కారాలపై దృష్టి సారిస్తున్నందున, ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ పార్క్‌లను ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ కోరారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నారా లోకేశ్
    టెస్లా

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    నారా లోకేశ్

    కేటీఆర్ స్ట్రాటజీని మెచ్చుకున్న చంద్రబాబు; బెస్ట్ కమ్యూనికేటర్ అంటూ ప్రశంస చంద్రబాబు నాయుడు
    జూనియర్ ఎన్టీఆర్- నారా లోకేశ్ మధ్య ఓటింగ్ పెట్టాలి: కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్
    ఆంధ్రప్రదేశ్‌లో గంజాయిని అరికట్టాలంటూ గవర్నర్‌కు లోకేశ్ ఫిర్యాదు తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    Chandrababu: ఏపీలో పోలీసులకు రక్షణ కరువు.. మహిళా పోలీసు డ్రెస్ లాగడంపై మండిపడ్డ చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    టెస్లా

    Tesla : త్వరలో భారత మార్కెట్లోకి టెస్లా.. రూ.20 లక్షలతో ధర ప్రారంభం భారతదేశం
    రూ.6వేల కోట్ల జీతాలను వాపస్ చేయనున్న టెస్లా డైరెక్టర్లు ఎలాన్ మస్క్
    టెస్లా చరిత్రలోనే అత్యంత చౌకైన ఈవీ వెహికల్.. ఇండియాలోనే మాన్యూఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ!  ఆటో మొబైల్
    కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో టెస్లా ఉన్నతాధికారుల కీలక చర్చలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025