Loading...
Chandrababu: ఏపీ సాగునీటి రంగానికి ప్రత్యేక వాటర్ రెగ్యులేటరీ కమిషన్
ఏపీ సాగునీటి రంగానికి ప్రత్యేక వాటర్ రెగ్యులేటరీ కమిషన్

Chandrababu: ఏపీ సాగునీటి రంగానికి ప్రత్యేక వాటర్ రెగ్యులేటరీ కమిషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2026
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పెండింగ్ పనుల పూర్తిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సాగునీటి వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఎత్తిపోతల పథకాల నిర్వహణ బాధ్యతలను జలహారతి కార్పొరేషన్‌కు అప్పగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే,సాగునీటి రంగానికి ప్రత్యేకంగా వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. అమరావతిలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ఉన్నతాధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, వాటి నిర్వహణ,భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రాజెక్టుల ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.

వివరాలు 

ఎత్తిపోతల పథకాలపై ప్రత్యేక పర్యవేక్షణ

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎత్తిపోతల పథకాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఇకపై వీటన్నింటినీ జలహారతి కార్పొరేషన్ ద్వారానే పర్యవేక్షించాలని సీఎం నిర్ణయించారు.

ఎత్తిపోతల పథకాల్లో ఉన్న మరమ్మతులు, రోజువారీ నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

ఆయకట్టుకు సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

వివరాలు 

ఇరిగేషన్ భూముల్లో సోలార్ ప్లాంట్లు

జలవనరుల శాఖ ఆధీనంలో ఉన్న ఖాళీ భూములను సమర్థంగా వినియోగించుకోవాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.

సాగునీటి శాఖకు చెందిన భూముల్లో ఒక్క ఎకరం కూడా వృథాగా ఉండకూడదని స్పష్టం చేశారు.

అందుబాటులో ఉన్న స్థలాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు.

ఈ ప్రతిపాదనకు సంబంధించిన సాధ్యాసాధ్యాలపై సమీక్షించారు.

ADVERTISEMENT

వివరాలు 

వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటుపై అధ్యయనం

విద్యుత్ రంగంలో ఉన్న నియంత్రణ మండలి తరహాలో సాగునీటి విభాగానికి కూడా ప్రత్యేక కమిషన్ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు.

విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్‌సీ) తరహాలో రాష్ట్రంలో వాటర్ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ కమిషన్ ఏర్పాటు వల్ల కలిగే ప్రయోజనాలు, విధివిధానాలు, సాధ్యాసాధ్యాలపై వెంటనే సమగ్ర అధ్యయనం చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

ADVERTISEMENT

వివరాలు 

రెండున్నరేళ్లలో 36 ప్రాజెక్టులు పూర్తి చేయాలి

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రభుత్వం గడువు విధించింది.

ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రాధాన్యత కలిగిన 36 ప్రాజెక్టులను గుర్తించింది.

రాబోయే రెండున్నరేళ్లలో ఈ ప్రాజెక్టులన్నింటినీ తప్పనిసరిగా పూర్తి చేయాలని చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

పనుల పురోగతిలో ఎలాంటి జాప్యం ఉండకూడదని హెచ్చరించారు. ప్రతి ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షించాలని, పనుల వేగం, నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు.

ప్రాజెక్టుల వారీగా పురోగతి నివేదికలను తనకు అందించాలని అధికారులను ఆదేశించారు.

నిర్ణీత గడువులోగా పనులు పూర్తయ్యేలా పటిష్ఠమైన కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు.

ADVERTISEMENT