Page Loader
AP and Tamil Nadu: చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఏపీ-తమిళనాడు కీలక ఒప్పందం
చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఏపీ-తమిళనాడు కీలక ఒప్పందం

AP and Tamil Nadu: చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఏపీ-తమిళనాడు కీలక ఒప్పందం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2025
04:25 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య చేనేత వస్త్రాల అమ్మకాల విషయంలో కీలక ఒప్పందం కుదిరింది. రెండు రాష్ట్రాలకు చెందిన చేనేత ఉత్పత్తులను ఆప్కో, కో-ఆప్టెక్స్ స్టోర్లలో విక్రయించేలా ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో ఈ ఏడాదికి రూ. 9 కోట్లకు పైగా వ్యాపారమే లక్శ్యంగా నిర్దేశించుకున్నారు. ఈ ఒప్పందం అధికారుల మధ్య ఏపీ మంత్రి సవిత, తమిళనాడు మంత్రి గాంధీ సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఏపీ చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ ఏపీలో తయారయ్యే చేనేత ఉత్పత్తులకు విస్తృత మార్కెటింగ్ కల్పించేందుకు తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు.

Details

చేనేత కార్మికుల జీవనోన్నతి లక్ష్యం 

రాష్ట్రంలోని చేనేత కార్మికులకు 365 రోజులూ నిరంతర ఉపాధి కల్పించడం, వారిని ఆర్థిక, సామాజికంగా స్థిరపడేలా చేయడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో భాగంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌ను విస్తరించే చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. దీనిలో భాగంగానే ఏపీకి చెందిన ఆప్కో, తమిళనాడుకు చెందిన కో-ఆప్టెక్స్ మధ్య ఈ కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు మంత్రి తెలిపారు.