Inner Ring Road Case: చంద్రబాబు,లోకేష్‌లపై ఏపీసీఐడీ చార్జిషీట్ దాఖలు
ఆంధ్రప్రదేశ్ సిఐడి గురువారం ఇన్నర్ రింగ్ రోడ్, మాస్టర్ ప్లాన్ కేసులో ట్రయల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇక్కడ టిడిపి అధినేత ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు ఇతర సహ నిందితులను 'కుట్రదారు'గా పేర్కొన్నారు. SPE & ACB కేసుల కోసం III అదనపు సెషన్స్ జడ్జి-కమ్-స్పెషల్ జడ్జి ట్రయల్ కోర్టు ముందు ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఏ1గా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,ఏ2గా మాజీ మంత్రి పొంగూరు నారాయణ పేర్లను పేర్కొంది.. కాగా ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో రియల్టర్ సోదరులు లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్‌లు,పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ప్రధాన నిందితులుగా సీఐడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
10 రోజుల వ్యవధిలో మరి కొన్ని ఛార్జ్ షీట్లు
సింగపూర్ తో చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం చేసుకుందని ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన అనేక కేసులకు సంబంధించి విచారణను ఎదుర్కొంటున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నిందితుడిగా ఉన్న నాయుడు 50 రోజులకు పైగా జైలులో ఉన్నాడు, అలాగే చంద్రబాబుపై నమోదైన అన్ని కేసుల్లో సీఐడీ స్పీడ్ పెంచింది. చంద్రబాబుపై నమోదైన మరో 10 రోజుల వ్యవధిలో స్కిల్ కేసు, ఫైబర్ నెట్ కేసు, లిక్కర్, మద్యం కేసుల్లో కూడా సీఐడీ చార్జి షీట్ వేయనుంది. ఈ మేరకు వీలైనంత వరకు చార్జిషీట్లు వేయటానికి సీఐడీ ప్రయత్నాలు చేస్తోంది.