LOADING...
Komatiteddy: విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్
విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్

Komatiteddy: విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 22, 2024
09:42 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్-విజయవాడ హైవే పనులకు స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్‌హెచ్ 65 పనులకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలపడంతో 2 నెలల్లో టెండర్లు పిలిచి నవంబర్ నాటికి ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడారు. రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ దాదాపు పూర్తియైందన్నారు. ఇక మిగిలిన కొద్దిపాటి భూసేకరణ కూడా సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేసి, టెండర్లకు నోటిఫికేషన్ ఇస్తామని వెల్లడించారు.

Details

అసత్య ప్రచారాలపై మండిపడ్డ కోమిటిరెడ్డి

మరోవైపు ఉప్పల్ ఎలవేటెడ్ కారిడర్ పనులను పరిశీలించానని, కాంట్రాక్టును వేరే వారికి త్వరతగతిన పనులు చేపడుతామన్నారు. మూడ్రోజుల్లోనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని దిల్లీలో కలిసి రాష్ట్రంలో నిర్మిస్తున్న జాతీయ రహదారుల పనులకు సహకారం కోరతామన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా పరిహారం ఇచ్చి, ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగానికి సంబంధించి భూసేకరణను ప్రారంభించాలని ఆయన అధికారులను అదేశించారు. ప్రభుత్వం మంచి పనులను చేస్తుంటే బీజేపీ నేతలు అసత్య ప్రచారాలను చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు.