Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత!
హోటళ్లు, రెస్టారెంట్లలో చికెన్, మటన్ పేరుతో కుక్క మంసాన్ని వండటంతో నాన్ వెజ్ ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. కుళ్లిన మాంసం, పాడైన మాంసంపై అధికారులు చర్యలు తీసుకుంటున్నా పరిస్థితులు మాత్రం మారడం లేదు. తాజాగా బెంగళూరులో మటన్ పేరుతో 90 డబ్బాలతో ఉన్న 4500 కిలోల కుక్క మాంసం పట్టుబడటం సంచలనంగా మారింది. దీంతో బెంగళూరులోని యశ్వంత్ పూర్ రైల్వే స్టేషన్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కుక్క మాంసం సరఫరా
మటన్ పేరుతో బెంగళూరుకు కుక్క మాంసం సరఫరా అవుతోందని హిందూ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జైపూర్ నుంచి బెంగళూరుకు వచ్చిన రైలులో 4500 కిలోల కుక్క మంసాన్ని అధికారులు గుర్తించారు. ఈ మాంసాన్ని బెంగళూరు నగరంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. దీనిపై బెంగళూరు ప్రాంత వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
రంగంలోకి దిగిన అధికారులు
ఈ విషయంపై హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు నోరు మెదపడం లేదు. ఈ నేపథ్యంలోనే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలీటీ అధికారులు రంగంలోకి దర్యాప్తు చేస్తున్నారు. గతంలోనూ కూడా చైన్నై నగరంలో కుక్క మాంసం వండుతున్నట్లు వార్తలొచ్చాయి. ఏకంగా వెయ్యి కేజీల మాంసాన్ని ఆర్ఫీఎఫ్ పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఏదిఏమైనా ఇలాంటి ఘటనపై అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.