CM Jagan: కిడ్నీ బాధితుల హామీలను నెరవేర్చినందుకు గర్విస్తున్నా : సీఎం జగన్
తన పాదయాత్రలో ఉద్దానం ప్రాంత కష్టాలను తెలసుకున్నానని, ఈ రోజు ఇచ్చిన హామీల నెరవేర్చినందుకు గర్విస్తున్నానని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పలాసలో రూ.85 కోట్లతో నిర్మించిన డా.వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ సెంటర్(Dr. YSR Kidney Research Center), సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి(Super Specialty Hospital)ని ఆయన ప్రారంభించారు. ఇక్కడ 42 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు, 60 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది సహాయక సిబ్బంది, 200 పడకల సామర్థ్యంతో డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేశారు. కంచిలి మండలం మకరాంపురంలో వైఎస్సార్ సుజలధార ప్రాజెక్టు పంప్ హౌస్ స్విచ్ నొక్కి ప్రారంభించారు. తర్వాత ఇండ్రస్టియల్ కారిడార్‌కు శంకుస్థాపన చేశారు.
దేశానికే కిడ్నీ రిసెర్చ్ సెంటర్ ఆదర్శంగా నిలుస్తుంది
వైఎస్సార్ సుజల ధార ప్రాజెక్టు ద్వారా దాదాపు 7 మండలాల్లోని 807 గ్రామాలకు సురక్షిత మంచి నీటి సరఫరా జరుగనుంది. వచ్చే ఫిబ్రవరిలో ఇక్కడే కిడ్నీ మార్పిడి చికిత్సను మొదలు పెడతామని, వైద్య రంగంలో దేశానికే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఆదర్శంగా నిలుస్తుందని సీఎం జగన్ చెప్పారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందులిస్తామని, విలేజ్ క్లినిక్, ఆరోగ్య సురక్ష ద్వారా పేదలకు అండగా ఉంటామన్నారు.