LOADING...
Upendra Dwivedi: ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు చెక్‌..వ్యూహాత్మకంగా గెలిచాం: ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది
ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు చెక్‌..వ్యూహాత్మకంగా గెలిచాం: ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

Upendra Dwivedi: ఆపరేషన్‌ సిందూర్‌తో పాక్‌కు చెక్‌..వ్యూహాత్మకంగా గెలిచాం: ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 10, 2025
09:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్‌ సిందూర్‌ క్రమంలో పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పామని భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది స్పష్టం చేశారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ వెల్లడించిన ప్రకారం,ఈ ఆపరేషన్‌లో భాగంగా భారతీయ వాయుసేన పాకిస్థాన్‌కు చెందిన ఐదు యుద్ధవిమానాలు,మరో ఒక పెద్ద విమానాన్ని కూల్చివేసింది. ఈ పరిణామాల అనంతరం ఐఐటీ మద్రాస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది,ఆపరేషన్‌ సిందూర్‌పై స్పందించారు. ఆ సమయంలో మన సైన్యం,పొరుగు దేశంతో చెస్‌ ఆటలా వ్యూహాత్మకంగా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు.

వివరాలు 

 'గ్రే జోన్‌'

శత్రువు తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అప్పట్లో ఎవరికీ స్పష్టంగా తెలియని పరిస్థితి నెలకొన్నదని, అలాంటి పరిస్థితిని 'గ్రే జోన్‌'గా నిర్వచిస్తారని తెలిపారు. అయితే, సమయానుకూలంగా సరైన వ్యూహాలతో ప్రతిస్పందించడం ద్వారా పాకిస్థాన్‌కు చెక్‌ పెట్టడంలో మన సైన్యం విజయవంతమైందని ఉపేంద్ర ద్వివేది గర్వంగా పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆపరేషన్ సిందూర్ పై  మాట్లాడుతున్న భారత సైన్యాధిపతి ఉపేంద్ర ద్వివేది