తదుపరి వార్తా కథనం

Army: 600 అడుగుల లోయలో పడిన ఆర్మీ ట్రక్కు.. ముగ్గురు జవాన్ల మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 04, 2025
02:27 pm
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ సమీపంలో భారత సైన్యానికి చెందిన ట్రక్కు లోయలో పడిపోయిన ఘటన విషాదాన్ని మిగిల్చింది.
జమ్మూ నుంచి శ్రీనగర్ వెళ్తున్న ఆర్మీ వాహనం 'బ్యాటరీ చెష్మా' ప్రాంతంలో అదుపుతప్పి సుమారు 600 అడుగుల లోతైన లోయలో పడిపోయింది.
ఈ దుర్ఘటనలో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారని అధికారులు ధ్రువీకరించారు. మృతులుగా సైనికులు అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మన్ బహదూర్‌లను గుర్తించినట్లు సైన్యం తెలిపింది.
ఘటనకు సంబంధించిన సమాచారం తెలియగానే పోలీస్, ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్, సివిల్ క్యూఆర్టీ బృందాలు వెంటనే సహాయక చర్యల కోసం రాంబన్‌కు వెళుతున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
ఈ విషాదకర ఘటన నేపథ్యంలో సైన్యంలో తీవ్ర విషాదం నెలకొంది.