Army truck: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఆర్మీ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఇద్దరు జవాన్లు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
అయితే చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.
ఈ ఘటన బందిపూర్ జిల్లాలోని సదర్ కూట్ పాయెన్ సమీపంలో జరిగింది. ఓ వంపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం లోయలోకి దూసుకుపోయింది.
భద్రతా బలగాలు, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన జవాన్లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కశ్మీర్ లోయల్లో ఆర్మీ వాహనాలు ప్రమాదానికి గురవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినాయి.
Details
350 అడుగుల లోయలోకి పడిపోయిన వాహనం
2022 డిసెంబర్ 24న పూంచ్ జిల్లాలో జరిగిన ఒక ప్రమాదంలో ఆర్మీ వాహనం 350 అడుగుల లోయలోకి పడిపోయింది. ఆ ఘటనలో ఐదుగురు సైనికులు మరణించగా, ఐదుగురు గాయపడ్డారు.
ఆర్మీ ఈ ప్రమాదానికి ఎలాంటి ఉగ్రకోణం లేదని స్పష్టం చేసింది. అదేవిధంగా 2022 నవంబర్ 4న రాజౌరి జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో వాహనం స్కిడ్ అవడం వల్ల లోయలో పడింది.
ఆ ఘటనలో కూడా ఆర్మీ సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా ప్రమాదాలు ఎదురవకుండా మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు.
డ్రైవర్లకు తగిన శిక్షణ, కఠిన నిబంధనలు అమలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు.