
Swati Maliwal assault case: స్వాతి మలివాల్ దాడి కేసు.. బిభవ్ కుమార్‌కు బెయిల్
ఈ వార్తాకథనం ఏంటి
రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్ కుమార్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మలివాల్ ఫిర్యాదు మేరకు మే 18న ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ను ముఖ్యమంత్రి నివాసం నుంచి అరెస్టు చేశారు.
బిభవ్ గత 100 రోజులుగా జైల్లో ఉన్నాడు. అతని బెయిల్ తిరస్కరణకు గురైంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బిభవ్ కుమార్ కు బెయిల్
सुप्रीम कोर्ट ने दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल के निजी सचिव बिभव कुमार को जमानत दी
— Manish Maheshwari AAP (@manish_aap) September 2, 2024
18 मई से जेल में थे बिभव कुमार, 100 दिन से जेल में थे
AAP MP स्वाति मालीवाल कथित पिटाई मामले में ज़मानत मिली@AamAadmiParty
వివరాలు
లోక్‌సభ ఎన్నికల సమయంలో సంచలనంగా మారిన ఘటన
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేయడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన కేజ్రీవాల్ నివాసంలోనే మే 13న చోటుచేసుకుంది.
దాడి అనంతరం మే 18న ఢిల్లీ పోలీసులు బిభవ్ కుమార్‌ని అరెస్ట్ చేశారు. అయితే దాదాపు 100 రోజులు జైల్లో ఉన్న ఆయనకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కోర్టు, అతడిని తిరిగి పర్సనల్ పీఏగా లేదా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇతర హోదాల్లో నియమించరాదని ఆదేశించింది.
వివరాలు
స్వాతి మలివాల్ బీజేపీకి సహకరిస్తోంది: ఆప్
స్వాతి మలివాల్ ఆరోపణల ప్రకారం, బిభవ్ కుమార్ ఆమెను పలు మార్లు చెంపపై కొట్టడంతో పాటు సున్నిత భాగాలపై, కడుపులో తన్నాడు.
పోలీసులు, ఫోరెన్సిక్ టీమ్ కేజ్రీవాల్ నివాసంలో సాక్ష్యాలు సేకరించారు. ఈ కేసు జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లి, బిభవ్‌ని విచారణకు హాజరుకావాలని కమిషన్ ఆదేశించింది.
ఆప్ ఈ ఘటనపై స్పందిస్తూ, స్వాతి మలివాల్ బీజేపీకి సహకరిస్తోందని ఆరోపించింది.
మంత్రి ఆతిషీ ప్రకారం, స్వాతి మలివాల్ ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా కేజ్రీవాల్ నివాసానికి చేరుకుని, డ్రాయింగ్ రూంలోకి అనుమతి లేకుండా ప్రవేశించిందని, బిభవ్ ఆమెను అడ్డుకోవడానికి మాత్రమే వచ్చాడని చెప్పారు.
బీజేపీ ఈ వ్యవహారంలో ఆప్‌పై దాడి చేస్తూ, కేజ్రీవాల్ తన సహాయకుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శలు చేసింది.