Page Loader
Bhagwant Mann "మీరు కేజ్రీవాల్ ను మాత్రమే అరెస్టు చెయ్యగలరు ..అయన ఆలోచనను కాదు": కేజ్రీవాల్ అరెస్ట్ పై పంజాబ్ సీఎం 
కేజ్రీవాల్ అరెస్ట్ పై పంజాబ్ సీఎం

Bhagwant Mann "మీరు కేజ్రీవాల్ ను మాత్రమే అరెస్టు చెయ్యగలరు ..అయన ఆలోచనను కాదు": కేజ్రీవాల్ అరెస్ట్ పై పంజాబ్ సీఎం 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 22, 2024
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను గురువారం అరెస్టు చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చర్యలు తీసుకుంది. కేజ్రీవాల్ అరెస్టును పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఖండించారు . ఈడీ పనితీరును ప్రశ్నిస్తూ.. ఈడీ అనేది బీజేపీ రాజకీయ జట్టు అని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే బీజేపీని అడ్డుకోగలదు. 'మీరు కేవలం కేజ్రీవాల్‌ను మాత్రమే అరెస్టు చేస్తారు.. కానీ ఆయన ఆలోచనను బంధించలేరు అంటూ పేర్కొన్నారు. కేజ్రీవాల్‌ ఒక వ్యక్తి కాదు.. ఆలోచనా విధానం.. తామంతా ఆయనతోనే నిలబడతామని ఆయన ట్విట్టర్ (ఎక్స్‌) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

Details 

కేజ్రీవాల్ అక్రమ అరెస్టుకు నిరసనగా ఆప్ దేశవ్యాప్తంగా ఆందోళనలు 

కాగా, నిన్న(గురువారం)నోటీసులు ఇస్తామంటూ ఢీల్లీ ముఖ్యమంత్రి ఇంటికి వచ్చిన ఈడీ అధికారులు.. అనంతరం సోదాలు నిర్వహించారు. విచారణ కోసం ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి రావాలని కేజ్రీవాల్‌కు అధికారులు సూచించగా.. అందుకు ఆయన నిరాకరించారు. ఇంట్లోనే విచారించాలని కోరారు. కాసేపటి తర్వాత కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారు. అక్రమ అరెస్టుకు నిరసనగా ఆమ్‌ఆద్మీ పార్టీ నేడు దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

భగవంత్ మాన్ చేసిన ట్వీట్