Arvind Kejriwal : అరవింద్ కేజ్రీవాల్ కి షాక్.. ముందస్తు విచారణను తిరస్కరించిన సుప్రీంకోర్టు
మద్యం కుంభకోణంలో జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉపశమనం కోసం మరికొంత కాలం వేచి చూడాల్సిందే. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్‌ను తక్షణమే విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పిటిషన్‌ను ఏప్రిల్ 29న విచారిస్తామని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది అయన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి నోటీసు జారీ చేసింది. ఏప్రిల్ 24 లోగా దాని సమాధానం దాఖలు చేయాలని ఆదేశించింది.
కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈడీకి నోటీసులు
మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. తన అరెస్టును సమర్థిస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కేజ్రీవాల్ చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్ 24లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థను న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఆదేశించింది.