
TS Assembly: రెవిన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయింది: శ్వేతపత్రాన్ని విడుదల చేసిన భట్టి
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క బుధవారం అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం ప్రవేశపెట్టారు.
శ్వేతపత్రం ప్రకారం, రాష్ట్ర మొత్తం అప్పు 2014-15లో రూ.72,658 కోట్ల నుంచి రూ.6.71 కోట్లకు (6,71,757) పెరిగింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సభలో ఈరోజు చర్చ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు శ్వేత పత్రాన్ని విడుదల చేసి ప్రసంగించారు.
చర్చకు ముందు సభలో 42 పేజీల శ్వేత పత్రాన్ని సభ్యులకు అందించారు.
Details
ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమిస్తాం: భట్టి
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ..తెలంగాణ సాధించింది ప్రజలంతా అభివృద్ధి చెందడానికన్నారు. కానీ,బిఆర్ఎస్ ప్రభుత్వం వనరులను సక్రమంగా ఉపయోగించుకోకుండా రోజూవారీ ఖర్చులకూ ఓడీ ద్వారా డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి సృష్టించిందన్నారు.
ఇలాంటి పరిస్థితి రావడాన్ని నేను దురదృష్టంగా భావిస్తునన్న ఆయన దశాబ్దకాలంలో జరిగిన ఆర్థిక తప్పిదాలు ప్రజలకు తెలియాలన్నారు.
ఆర్థిక సవాళ్లను బాధ్యతాయుతంగా అధిగమించే దిశలో శ్వేతపత్రం మొదటి అడుగు అన్నారు.
విద్య,ఆరోగ్యం వంటి కీలక రంగాలపై తెలంగాణ రాష్ట్రం తగినంత నిధులు వెచ్చించలేకపోయిందని, ఇక్కడ బడ్జెట్‌లో మొత్తం వ్యయం నిష్పత్తిలో దేశంలోనే అత్యల్పంగా ఉందన్నారు.
పై వాస్తవాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే,2014లో రెవెన్యూ మిగులు రాష్ట్రంగా,దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల ఊబిలో కూరుకుపోయిందని తెలుస్తోంది.