Page Loader
Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే
భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే

Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 25, 2025
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.ఈ దాడి జరిగిన తర్వాత భారత ప్రభుత్వం తీవ్ర స్థాయిలో స్పందించింది. పాకిస్థాన్ పై చర్యలు తీసుకుంటూ కీలక నిర్ణయాలను ప్రకటించింది.ఈ ఘటనకు స్పందనగా, భారత ప్రభుత్వం పాకిస్తాన్‌తో ఉన్న సింధు జల ఒప్పందాన్ని రద్దు చేసింది. అంతేకాకుండా,పాకిస్తాన్ పౌరులకు జారీ చేస్తున్న సార్క్ వీసాలను కూడా రద్దు చేసింది. ఇప్పటికే భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులకు కూడా ప్రభుత్వం గడువిచ్చింది. 48 గంటలలోపు దేశాన్ని విడిచి వెళ్ళాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్ అధికారిక ఎక్స్ అకౌంటును కూడా భారత్ బ్లాక్ చేసింది.

వివరాలు 

పాకిస్తాన్ నుంచి పెద్దమొత్తంలో డ్రైఫ్రూట్స్ దిగుమతి

ఈ చర్యలతో భారత్-పాకిస్తాన్ మధ్య సంబంధాలు మరింత తీవ్రంగా దిగజారాయి. ప్రభుత్వ నిర్ణయాల ప్రభావం ఇప్పుడు రెండు దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్యంపై స్పష్టంగా కనిపించనుంది. రెండు దేశాల మధ్య భారీ స్థాయిలో వాణిజ్యం కొనసాగుతోంది. కానీ ఈ పరిణామాల దృష్ట్యా పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు బందవ్వడం వల్ల భారత మార్కెట్లో కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. వాణిజ్యానికి సంబంధించి, భారత్ పాకిస్తాన్ నుంచి పెద్దమొత్తంలో డ్రైఫ్రూట్స్ (ఎండిన పండ్లు) దిగుమతి చేస్తోంది. భారత మార్కెట్లో వీటి వినియోగం చాలా ఎక్కువ. అయితే పాకిస్తాన్‌తో వాణిజ్య సంబంధాలు నిలిపివేయడం వల్ల భారతదేశంలో డ్రైఫ్రూట్స్ అందుబాటు తగ్గి, ధరలు భారీగా పెరగొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వివరాలు 

ఉప్పు ధరలు,ఆప్టికల్ లెన్స్ కి రెక్కలు 

డ్రైఫ్రూట్స్ తో పాటు భారత్,పాకిస్తాన్ నుంచి భారీగా సింధు ఉప్పును కూడా దిగుమతి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సింధు ఉప్పు లభించే దేశాల్లో పాకిస్తాన్ ఒకటి. అక్కడి నుంచి వచ్చే ఈ ఉప్పు భారతదేశంలో వినియోగించబడుతోంది. కానీ ఇప్పుడిది నిలిచిపోవడం వల్ల ఈ ఉప్పు ధరలు రెట్టింపవ్వొచ్చని భావిస్తున్నారు. ఇంకో ముఖ్యమైన అంశం.. భారత్‌లో ఆప్టికల్ లెన్స్ పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతున్నాయి. భారత మార్కెట్లో వీటి డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల పాకిస్తాన్ నుంచి దిగుమతులు కీలకం. ప్రస్తుతం వాణిజ్య సంబంధాలు నిలిచిపోవడంతో ఆప్టికల్ లెన్స్ కూడా వినియోగదారులకు అందుబాటులో లేకుండా ధరలు భారీగా పెరగే అవకాశం ఉంది.