Page Loader
 G20 summit 2023: ప్రధాని మోదీ సీటు ముందు నేమ్ ప్లేట్‌పై  'భార‌త్‌' పేరు
మోదీ సీట్ ముందు భార‌త్‌ పేరు

 G20 summit 2023: ప్రధాని మోదీ సీటు ముందు నేమ్ ప్లేట్‌పై  'భార‌త్‌' పేరు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Sep 09, 2023
12:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

G20 శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో భారత్ పేరు మరోసారి కనిపించింది. రౌండ్‌టేబుల్‌పై ప్ర‌ధాని నరేంద్ర మోదీ కూర్చున్న స్థానంలో భార‌త్ నేమ్ ప్లేట్ దర్శనమిచ్చింది. భార‌త్ మిమ్మ‌ల్ని స్వాగ‌తిస్తోంద‌ని మోదీ తన ప్రారంభ ఉపాన్యాసంలో చెప్పారు. ఓ అంతర్జాతీయ సదస్సులో దేశం పేరును భారత్ అని రాయడం ఇదే తొలిసారి కావడం విశేషం. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్‌ను సమావేశంలోకి ఆహ్వానించిన మోదీ, అనంతరం కోణార్క్ వీల్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. భార‌త మండ‌పంలో ఏర్పాటు చేసిన కోణార్క్ వీల్ చిత్రపటం వ‌ద్ద నిలబడి బైడెన్ వ‌చ్చిన స‌మ‌యంలో దాని గురించి వివ‌రించారు. మరోవైపు G-20లో శాశ్వత స‌భ్య‌త్వం పొందిన ఆఫ్రికన్ యూనియ‌న్(AU) అధినేత‌ను ప్ర‌ధాని ఆలింగ‌నం చేసుకుని కుర్చీలో కూర్చోబెట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రారంభ ఉపాన్యాసం ఇస్తున్న మోదీ