Gyanvapi mosque: భారీ భద్రత నడుమ జ్ఞానవాపి మసీదులో సర్వే ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలోని జ్ఞానవాపి మసీదు(Gyanvapi mosque) సముదాయంలో సోమవారం ఉదయం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం సర్వేను ప్రారంభించింది.
వారణాసి జిల్లా కోర్టు జ్ఞానవాపి మసీదులో శాస్త్రీయ సర్వేకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదే సమయంలో వారణాసి జిల్లా కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టులో విచరణ జరగక ముందే మసీదులో సర్వే నిర్వహిస్తున్నట్లు మసీదు నిర్వహణ కమిటీ చెబుతోంది.
జ్ఞానవాపి మసీదు ముందుగా ఉన్న హిందూ దేవాలయంపై నిర్మించబడిందా? లేదా? అని నిర్ధారించడానికి వాస్తవాలు తెలియాలంటే శాస్త్రీయ పరిశోధన అవసరమని వారణాసి జిల్లా కోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు పురావస్త అధికారులు సర్వే చేపడుతున్నారు.
యూపీ
40మంది సభ్యుల సమక్షంలో సర్వే
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) బృందం ఆదివారం నాడే సర్వేకు కావాల్సిన అన్ని పరికరాలతో వారణాసికి చేరుకుంది.
యూపీ పోలీసుల భారీ భద్రత నడుమ సర్వేను నిర్వహిస్తున్నారు. మొత్తం 40మంది సభ్యుల సమక్షంలో ఈ శాస్త్రీయ సర్వేను చేపడుతున్నారు.
అంజుమన్ ఇంతేజామియా మస్జీద్ కమిటీ ఈ సర్వేలో పాల్గొనడం లేదు.
తాము సర్వేను బహిష్కరించినట్లు కమిటీ సంయుక్త కార్యదర్శి ఎస్ఎం యాసిన్ పేర్కొన్నారు.
గతేడాది మే 16న కాశీ విశ్వనాథ దేవాలయం పక్కనే ఉన్న జ్ఞాన్‌వాపి మసీదులో కోర్టు ఆదేశాల మేరకు సర్వే నిర్వహించగా హిందువులకు సంబంధించి 'శివలింగం', ముస్లీంలకు సంబంధించి 'ఫౌంటెన్' నిర్మాణాలను గుర్తించారు. ఈ క్రమంలో శాస్త్రీయ ఆధారాల కోసం ఇప్పుడు ఈ సర్వే చేస్తున్నారు.