Page Loader
Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు రెండు 'చికెన్ నెక్'లు ఉన్నాయ్.. అవి మరింత బలహీనం 
బంగ్లాదేశ్‌కు రెండు 'చికెన్ నెక్'లు ఉన్నాయ్.. అవి మరింత బలహీనం

Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు రెండు 'చికెన్ నెక్'లు ఉన్నాయ్.. అవి మరింత బలహీనం 

వ్రాసిన వారు Sirish Praharaju
May 26, 2025
09:57 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశానికి వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'చికెన్ నెక్ కారిడార్' పై వచ్చిన బెదిరింపులకు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ గట్టి కౌంటర్ ఇచ్చారు. బంగ్లాదేశ్ ను ఉద్దేశించి, ఆయన తీవ్రమైన స్వరంతో వ్యాఖ్యానిస్తూ, భారతదేశానికి ఒక చికెన్ నెక్ ఉన్నా, బంగ్లాదేశ్ కు ఇలాంటి రెండు కారిడార్లు ఉన్నాయని, వాటి పరిస్థితి మరింత బలహీనమైనదని చెప్పారు. భారత్ ను బెదిరిస్తే నష్టాలు బంగ్లాదేశ్ కు మాత్రమే ఉంటాయని హెచ్చరించారు. ఈశాన్య భారతదేశం, మిగతా భాగాలను పశ్చిమ బెంగాల్‌లోని సన్నని సిలిగురి కారిడార్ ద్వారా మాత్రమే అనుసంధానం అవుతుందని చెప్పారు. ఈ కారిడార్ వెడల్పు సుమారు 22 నుండి 35 కిలోమీటర్లు మధ్య ఉంటుందని వివరించారు.

వివరాలు 

బంగ్లాదేశ్‌లోని 80 కి.మీ ఉత్తర కారిడార్, 28 కి.మీ చిట్టగాంగ్ కారిడార్‌ల ప్రస్తావన 

ఈ విషయంపై హిమంత బిశ్వ శర్మ ఈనెల 25న సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ,బంగ్లాదేశ్‌లోని రెండు ముఖ్యమైన,బలహీనమైన ప్రాంతాలను వివరిస్తూ చెప్పారు. మొదటిది,భారతదేశంలోని దక్షిణ దినాజ్‌పూర్ నుంచి మేఘాలయలోని నైరుతి గారో హిల్స్ వరకు విస్తరించి,సుమారు 80 కిలోమీటర్ల మేర ఉన్న ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్. ఈ కారిడార్ లో ఏవైనా అంతరాయాలు ఏర్పడితే, రంగ్‌పూర్ డివిజన్ బంగ్లాదేశ్ లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రెండోది, దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వైపు సుమారు 28 కిలోమీటర్ల దూరంలో ఉండే చిట్టగాంగ్ కారిడార్. ఇది బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని చిట్టగాంగ్, రాజకీయ రాజధాని ఢాకా మధ్య కనెక్ట్ అయ్యే ఏకైక మార్గం అని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

 హిమంత బిస్వా శర్మ  చేసిన ట్వీట్