Page Loader
తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి  
తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి

తమిళనాడు: విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు.. 11 మంది మృతి  

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2023
07:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో బాణాసంచా యూనిట్లలో మంగళవారం జరిగిన రెండు వేర్వేరు పేలుళ్లలో కనీసం 11 మంది మరణించారని పోలీసులు తెలిపారు. ఇద్దరు మహిళా కార్మికులను సంఘటనా స్థలం నుండి రక్షించి చికిత్స కోసం శ్రీవిల్లిపుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు,అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగారు. రంగపాళయంలోని బాణసంచా యూనిట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో కాలిపోయిన ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారికీ సంబందించిన వివరాలు తెలియరాలేదని ఓ సీనియర్ పోలీస్ ఆఫీసర్ తెలిపారు.

Details 

భాదితులకు పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి

రంగపాళ్యంలోని బాణాసంచా యూనిట్‌లో ఏడుగురు వ్యక్తులు మరణించగా, యూనిట్ నుండి రక్షించబడిన ముగ్గురు వ్యక్తులు కూడా గాయాలతో మరణించారు. ఇదిలా ఉండగా, కమ్మపట్టి గ్రామంలోని బాణసంచా యూనిట్‌లో మరో అగ్ని ప్రమాదంలో వెంబు అనే 35 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంతాపం తెలుపుతూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

విరుదునగర్‌లోని బాణసంచా తయారీ ఫ్యాక్టరీల‌లో పేలుళ్లు