
Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు
ఈ వార్తాకథనం ఏంటి
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా పరిశ్రమలో మృతుల చెందిన కుటుంబాలకు ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
అందులో ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు కోటి రూపాయల పరిహారాన్ని అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు.
అదే విధంగా ఈ ఘటనపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల పరిహారాన్ని అందించనున్నట్లు మోదీ ప్రకటించారు.
ఇక గాయపడిన వారికి రూ.50వేలు పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
Details
ఇవాళ విశాఖకు సీఎం చంద్రబాబు నాయుడు
అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు.
ఇక గాయపడ్డ వారిని పరామర్శించేందుకు ఇవాళ సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖకు వస్తున్నారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 41 మందిని పరామర్శించి, వారికి పరిహారం అందించనున్నారు. ప్రస్తుతం కేజీహెచ్‌లో 12 మృతదేహాలకు పోస్టుమార్టం జరుగుతోంది.
Details
మృతులు వీరే
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి అయ్యింది. శిథిలాల కింద చిక్కుకున్న 33 మందిని జెయింట్ ఫైరింజిన్ తో బయటికి తీశారు.
ప్రమాద ఘటనపై రాంబిల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది
మృతుల వివరాలు
1)నీలాపు రామిరెడ్డి
2. ప్రశాంత్ హంస
3. నారాయణరావు
4. గణేష్ కుమార్
5. హారిక
6. రాజశేఖర్
7. సతీష్
8. నాగబాబు
9. నాగేశ్వర రామచంద్ర రావు
10. సన్యాసినాయుడు
11. చిన్నారావు
12. పార్థసారథి
మోహన్ దుర్గాప్రసాద్
14. ఆనందరావు
15. సురేంద్ర
16. వెంకట సాయి
17. చిరంజీవి
18. గుర్తు తెలియని వ్యక్తి