Page Loader
Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికపై దుమారం.. అతిషి సహా ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్
ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికపై దుమారం.. అతిషి సహా ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

Delhi: ఢిల్లీ అసెంబ్లీలో కాగ్ నివేదికపై దుమారం.. అతిషి సహా ఆప్ ఎమ్మెల్యేల సస్పెన్షన్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 25, 2025
12:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీ అసెంబ్లీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.బీజేపీ ప్రభుత్వం శాసనసభలో గత ప్రభుత్వానికి సంబంధించిన కాగ్ నివేదికను ప్రవేశపెట్టింది. ఈ సందర్భంలో ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో అంబేద్కర్, భగత్ సింగ్ చిత్రపటాలను తొలగించిన అంశాన్ని ఖండిస్తూ ఆప్ ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని స్పీకర్, మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రతిపక్ష నేత అతిషితో సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి సస్పెండ్ చేశారు. గత ఆప్ ప్రభుత్వం భారీ అవినీతికి పాల్పడిందని బీజేపీ మంత్రులు, ఎమ్మెల్యేలు తీవ్ర ఆరోపణలు చేశారు.

వివరాలు 

 లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా ప్రసంగం 

మద్యం కుంభకోణంలో భాగంగా అక్రమాలు జరిగాయని విపరీతంగా విమర్శించారు. మరోవైపు, అంబేద్కర్ చిత్రాన్ని తొలగించి ప్రధాని మోదీ చిత్రాన్ని పెట్టడంపై ప్రతిపక్ష నేత అతిషి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంబేద్కర్ చిత్రాన్ని మళ్లీ ప్రతిష్ఠించే వరకు నిరసన కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సోమవారం తొలిసారి శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి, ఇందులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మొదటగా ప్రమాణం చేశారు, అనంతరం విజేందర్ గుప్తా స్పీకర్‌గా ఎన్నికయ్యారు. మంగళవారం, శాసనసభను ఉద్దేశించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే. సక్సేనా ప్రసంగం చేశారు.