Page Loader
Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు
బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు

Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 24, 2024
03:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. హాస్టల్ లోకి చొరబడి ఓ నిందితుడు మహిళ గొంతు కొసి చంపిన ఘటన కలకలం రేపుతోంది. బీహార్ కు చెందిన కృతి కుమారి మంగళవారం బెంగళూరులోని కోరమంగళలో పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహంలో దారుణంగా హత్యకు గురైంది. రాత్రి 11:10 నుంచి 11:30 గంటల మధ్య గుర్తు తెలియని వ్యక్తి కత్తితో చొరబడినట్లు తెలిసింది. ఈ ఘటనలో బాధితురాలు అక్కడిక్కడే మృతి చెందింది.

Details

కేసు నమోదు చేసుకున్న పోలీసులు

ఘటనా స్థలానికి చేరుకున్న కోరమంగళ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సారా ఫాతిమా మాట్లాడుతూ ఘటన స్థలంలో లభించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నామన్నారు. బాధితురాలికి తెలిసిన వ్యక్తే ఈ నేరానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.