Page Loader
Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి 
చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి

Pulivarthi Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి 

వ్రాసిన వారు Sirish Praharaju
May 14, 2024
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి ఎస్వీ మహిళా యూనివర్సిటీలో చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. పద్మావతి మహిళా యూనివర్సిటీలోని స్ట్రాంగ్‌రూమ్‌ దగ్గర ఘటన జరిగింది.దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈదాడిలో నాని భద్రతా సిబ్బందికి గాయాలు కాగా,కారు కూడా ధ్వంసం అయింది.దాడిని నిరసిస్తూ టీడీపీ నేతలు వర్సిటీ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దాడి సమాచారం తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు మహిళావర్సిటీ ప్రాంగణానికి చేరుకున్నారు. నిందితులు అక్కడే ఉన్నారనే సమాచారంతో గాలింపు చేపట్టారు. వర్సిటీ ప్రాంగణంలో ఉన్న ఓకారులో వైసీపీ జెండాలు,మద్యం బాటిళ్లు ఉండటంతో ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. దాడి గురించి పులివర్తి నాని ఎస్పీకి ఫిర్యాదు చేసి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పులివర్తి నాని చేసిన ట్వీట్