
IIT Baba: న్యూస్‌రూమ్‌లో ఐఐటీ బాబాపై దాడి!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రయాగ్‌రాజ్ వేదికగా ఇటీవల జరిగిన కుంభమేళా సందర్భంగా ఐఐటీ బాబా (అభయ్ సింగ్) సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రసిద్ధి చెందారు. అయితే తాజాగా ఆయన నోయిడాలో ఓ ప్రైవేట్ టీవీ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తుండగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇంటర్వ్యూ మధ్యలోనే కొందరు కాషాయ దుస్తులు ధరించిన వ్యక్తులు న్యూస్‌రూమ్‌లోకి చొచ్చుకువచ్చి తనపై దాడి చేశారని ఐఐటీ బాబా ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి అభయ్ సింగ్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన దాడికి న్యాయం చేయాలంటూ పోలీస్ అవుట్ పోస్టు ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఆయనకు నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించారు.
Details
ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి
అయితే ఈ ఘటనకు ముందుగా ఐఐటీ బాబానే ఛానల్ యాంకర్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది .హరియాణాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ పూర్తి చేశారని చెబుతున్నారు. కొంతకాలం కార్పొరేట్ రంగంలో పనిచేసిన ఆయన ఆ తర్వాత ఫొటోగ్రఫీపై ఆసక్తితో ఆధ్యాత్మికత వైపు మళ్లారు. ఇటీవల కుంభమేళాలో ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న తర్వాత ఆయన పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది.