
Atul Subhash: అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు.. భార్య నిఖితా సింఘానియా అరెస్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ (34 కేసు కీలక మలుపు తీసుకుంది.
ఆదివారం కర్ణాటక పోలీసులు అతని భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా, సోదరుడు అనురాగ్‌లను అరెస్టు చేశారు.
నిఖితను గురుగ్రామ్, ఆమె తల్లి, సోదరుడిని అలహాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్ పోలీసులు వెల్లడించారు.
ఆ ముగ్గురినీ కోర్టులో హాజరుపరచి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
అతుల్ సుభాష్ సోదరుడు అనురాగ్, నిఖిత, ఆమె కుటుంబసభ్యులు అతని సోదరుడిని మానసికంగా వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Details
2019లో అతుల్ సుభాష్, నిఖిత వివాహం
దీనిపై పోలీసులు నిఖితతో పాటు, ఆమె తల్లి, సోదరుడిపై కేసు నమోదు చేశారు.
వారి విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసి, జౌన్‌పూర్‌కు పంపించారు.
ఇప్పటికే, విచారణకు హాజరుకావాలంటూ నిఖిత కుటుంబానికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.
2019లో ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా అతుల్ సుభాష్‌కు నిఖిత పరిచయం అయ్యింది. ఇద్దరూ ఐటీ ప్రొఫెషనల్స్. అదే ఏడాది వారి వివాహం ఘనంగా జరిగింది.
తర్వాత బెంగళూరులో నివాసం ఏర్పరచుకున్న ఈ జంటకు ఒక బాబు జన్మించాడు. 6
Details
నిఖితపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత
అయితే, ఏడాదికి వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. కొడుకుతో పాటు నిఖిత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోవడంతో, అతుల్ ఒంటరిగా మిగిలిపోయాడు.
నిఖిత అతుల్‌పై వివిధ ఆరోపణలతో మొత్తం 9 కేసులు నమోదు చేసింది. వాటిలో శారీరక వేధింపులు, అసహజ శృంగారం, వరకట్న వేధింపులు వంటి అభియోగాలున్నాయి.
ప్రస్తుతం నిఖితపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఆమె దిల్లీలో ఓ ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా, ఆ కంపెనీ ఆమెను తొలగించాలంటూ పలువురు వినతులు చేస్తున్నారు.