తదుపరి వార్తా కథనం

Autos Strike Today: ఆటో డ్రైవర్ల సమ్మె.. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 16, 2024
11:49 am
ఈ వార్తాకథనం ఏంటి
మహాలక్ష్మి పథకంతో నష్టపోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలంటూ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్ల సంఘాలు ఆటోల బంద్‌కు పిలుపునిచ్చాయి.
తెలంగాణలోని ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదుకోవాలని, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
ఆటో బంద్‌కు సంబంధించి తెలంగాణ మోటర్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌కు సమ్మె నోటీసు ఇచ్చింది.
ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి హైదరాబాద్ లోని నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
తమ సమస్యలు పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.