Page Loader
Baba Siddique murder: బాబా సిద్ధిఖీ హత్య కేసులో యూట్యూబ్ చూసి శిక్షణ పొందిన షూటర్లు.. ఇన్‌స్టా లో కమ్యూనికేషన్
యూట్యూబ్ చూసి శిక్షణ పొందిన షూటర్లు.. ఇన్‌స్టా లో కమ్యూనికేషన్

Baba Siddique murder: బాబా సిద్ధిఖీ హత్య కేసులో యూట్యూబ్ చూసి శిక్షణ పొందిన షూటర్లు.. ఇన్‌స్టా లో కమ్యూనికేషన్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ నాయకుడు బాబా సిద్ధిఖీ హత్య కేసు సంచలనం సృష్టించింది. ముంబై పోలీసులు ఈ కేసును అత్యంత సీరియస్‌గా తీసుకున్నారు. నెలల తరబడి సిద్ధిఖీని చంపడానికి ఎలా ప్లాన్ వేశారో మొత్తం వివరాలు బయటకు వచ్చాయి. ఈ నేరానికి పెద్ద నెట్‌వర్క్ ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో నిందితులు హత్య కోసం పాటించిన పద్ధతులు, విధానాలు బయట పడ్డాయి. పూణేలో సిద్ధిఖీని హతమార్చడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. ఏఎన్ఐ నివేదిక ప్రకారం, నిందితులు ఆయుధాలు లేకుండా సిద్ధిఖీ నివాసాన్ని అనేకసార్లు సందర్శించారు, దాడి కోసం సమాచారాన్ని సేకరించారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ కీలక ప్రత్యక్ష సాక్షులతో సహా 15 మందికి పైగా వ్యక్తుల నుండి వాంగ్మూలాలను నమోదు చేసింది.

వివరాలు 

 యూట్యూబ్ వీడియోలను చూసి ఎలా షూటింగ్ చేయాలో శిక్షణ 

"ముంబై క్రైమ్ బ్రాంచ్ తెలిపిన సమాచారం ప్రకారం, బాబా సిద్ధిఖీ హత్యకు సంబంధించిన మొత్తం ప్లానింగ్ పూణేలో జరిగింది. ఇప్పటి వరకు 15 మందికి పైగా వాంగ్మూలాలను ముంబై క్రైమ్ బ్రాంచ్ నమోదు చేసింది. సంఘటన జరిగిన సమయంలో అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు," అని ఏఎన్ఐ తెలిపింది. అక్టోబర్ 12న జరిగిన ఘటన తర్వాత వెంటనే అరెస్టయిన షూటర్లు గుర్మైల్ సింగ్, ధరమ్‌రాజ్ కశ్యప్‌లు యూట్యూబ్ వీడియోలను చూసి ఎలా షూటింగ్ చేయాలో శిక్షణ పొందారని తెలుస్తోంది. సిద్ధిఖీ ఫోటోను అందుకున్న వెంటనే అతడిని లక్ష్యంగా చేసుకోవాలని ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది.

వివరాలు 

ప్రవీణ్ లోంకర్ ఈ హత్య కుట్రలో కీలక పాత్ర

ప్రస్తుతం నలుగురు వ్యక్తులు అరెస్టు కావడంతో అనుమానితుల వల బయటపడింది. పూణేకు చెందిన ప్రవీణ్ లోంకర్ ఈ హత్య కుట్రలో కీలక పాత్ర పోషించినట్లు భావిస్తున్నారు. తాజాగా అరెస్టు అయిన హరీష్‌కుమార్ నిసాద్ నిందితులకు రూ. 2 లక్షలు ఇచ్చినట్లు సమాచారముంది. ఆయుధాలు డెలివరీ చేయడంతో పాటు ఆర్థిక, రవాణా సహాయాన్ని కూడా అందించాడని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ ఇద్దరు కీలక నిందితులు పరారీలో ఉన్నారు. మరో అనుమానితుడు, షూటర్ శివకుమార్ గౌతమ్, ప్రవీణ్ సోదరుడు శుభమ్ లోంకర్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

వివరాలు 

సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా

దర్యాప్తులో నిందితులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను విస్తృతంగా ఉపయోగించారని వెల్లడైంది. కమ్యూనికేషన్ కోసం స్నాప్‌చాట్, కాల్స్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించారు. హత్యకు 25 రోజుల ముందు వరుకు సిద్ధిఖీ నివాసం, కార్యాలయంపై నిఘా వేశారు.