
Amaravati: రేపు అమరావతిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై ఆంక్షలు విధిస్తూ పోలీసులు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ రేపు రాష్ట్రా పర్యటనకు రానున్న నేపథ్యంలో, అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్లు ఎగరవేయడంపై పూర్తిస్థాయి నిషేధం అమలులోకి తెచ్చారు.
ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ పర్యటన చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా అమరావతిలో రాజధాని నిర్మాణ పనులకు ఆయన తిరిగి శ్రీకారం చుడుతున్నారు.
మొత్తంగా రూ.58,000 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు.
శాశ్వత సచివాలయం, అసెంబ్లీ భవనం,హైకోర్టు భవనం నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు.
వివరాలు
నాగాయలంకలో మిసైల్ పరీక్షా స్థలానికి పునాది
అదే విధంగా, ఎమ్మెల్యేలు, మంత్రుల నివాస సముదాయాల నిర్మాణానికి పునాది వేయనున్నారు.
ఆలిండియా సర్వీసెస్ అధికారుల గృహ సముదాయానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది.
అదనంగా, కృష్ణా జిల్లా నాగాయలంకలో మిసైల్ పరీక్షా స్థలానికి పునాది వేయనున్నారు.
విశాఖపట్నంలో 'యూనిటీ మాల్' నిర్మాణానికి కూడా శంకుస్థాపన జరుగుతుంది.
మోడీ ఈ పర్యటనలో రూ.3,680 కోట్ల విలువైన జాతీయ రహదారి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.
కాజీపేట-విజయవాడ మూడవ రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. అలాగే గుంటూరు-గుంతకల్ డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా కొన్ని నిర్మాణ పనులకు ఆయన ప్రారంభోత్సవం చేస్తారు.
వివరాలు
సభా వేదికపై మొత్తం 14 మంది ప్రముఖులు
ప్రధాని పర్యటన మొత్తం గంటా 25 నిమిషాల పాటు కొనసాగనుంది. మే 2న మధ్యాహ్నం 3:25కి ఆయన రాష్ట్రానికి చేరుకోనున్నారు.
సభా వేదికపై మొత్తం 14 మంది ప్రముఖులు ఆసీనులుగా ఉంటారు.
సభలో తొలి ప్రసంగం మంత్రి నారాయణ చేస్తారు. అనంతరం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తారు.
చివరగా ప్రధాని మోదీ ప్రసంగంతో సభ ముగియనుంది. ప్రధాని పర్యటన సందర్భంగా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
ప్రధాని సభకు రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీలు, నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం పంపింది.