Page Loader
Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు 

Bandi Sanjay: దొంగ ఓట్లతో గెలిచేందుకు వైఎస్ జగన్ కుట్ర- బండి సంజయ్ ఆరోపణలు 

వ్రాసిన వారు Stalin
Aug 21, 2023
06:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ సర్కార్‌పై తీవ్రమైన విమర్శలు చేశారు. విజయవాడలో నిర్వహించిన 'ఓటర్ చేతన్ మహాభియాన్' కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై తీవ్రమైన ఆరోపణలు చేసారు. జగన్ దొంగ ఓట్లతో మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నట్లు విమర్శించారు. అంతేకాకుండా జగన్ తాగుబోతులను తాకట్టు పెట్టి అప్పు తెస్తున్నట్లు మండిపడ్డారు. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి, లిక్కర్ బాండ్లు ఎలా రిలీజ్ చేస్తారని ప్రశ్నించారు. అవినీతితో పాటు అప్పుల్లో కూడా అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ పోటీ పడుతున్నట్లు సంజయ్ విమర్శలు గుప్పించారు.

జగన్

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో ఏపీలో పనులు: సంజయ్

ఆంధ్రప్రదేశ్‌లో అంతో, ఇంతో మంచి జరుగుతుందంటే, అది కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల వల్లే అని బండి సంజయ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం అవినీతిగా మారిందన్నారు. అవినీతి రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కి చెప్పారు. మరోసారి ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సంజయ్ పేర్కొన్నారు. అయినా కూడా దొంగఓట్లతో మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందని మండిపడ్డారు. బోగస్ ఓట్లపై కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియఎస్‌గా ఉందని పేర్కొన్నారు.