
Beating Retreat: 10 రోజుల కాల్పుల విరమణ తర్వాత.. నేటి నుంచి బీటింగ్ రిట్రీట్ సెర్మనీ
ఈ వార్తాకథనం ఏంటి
పంజాబ్‌లోని మూడు ముఖ్యమైన సరిహద్దు ప్రాంతాల్లో ఈరోజు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య గత 10 రోజుల నుంచి కాల్పుల విమరణ అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో, ఈ కార్యక్రమం మళ్లీ ప్రారంభం కానుంది. ఈరోజు నిర్వహించే బీటింగ్ రిట్రీట్ పూర్తిస్థాయిలో కాకపోయినా, పరిమితంగా నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అత్తారి-వాఘా, హుస్సేనివాలా, ఫజిల్కా ప్రాంతాల్లో జరగనుంది, ఇవి పాకిస్థాన్ సరిహద్దులతో సమీపంగా ఉన్నవిగా గుర్తించవచ్చు.
వివరాలు
పాక్ గేట్లు మూసే - కరచాలనం ఉండదు
ఈ కార్యక్రమం సందర్భంగా పాకిస్థాన్ వైపు ఉన్న బోర్డర్ గేట్లను తెరవబోవడం లేదని అధికారులు స్పష్టం చేశారు.అలాగే పాక్ బోర్డర్ సిబ్బందితో సాధారణంగా జరిగే కరచాలన కార్యక్రమం కూడా ఈసారి ఉండదని చెప్పారు.అయినప్పటికీ,ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం మాత్రం ప్రేక్షకులకు కల్పించారు. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభం ఈ రోజు సాయంత్రం 6 గంటలకు బీటింగ్ రిట్రీట్ కార్యక్రమం ప్రారంభం కానుంది.అమృత్‌సర్‌కు సమీపంలో ఉన్న అత్తారి బోర్డర్,ఫిరోజ్‌పుర్ జిల్లా హుస్సేనివాలా, ఫజిల్కాలోని సద్కీ బోర్డర్‌లలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రత్యేకంగా, సద్కీ బోర్డర్ వద్ద ఈవెంట్ ప్రారంభానికి ముందే, సుమారు సాయంత్రం 5.30 నిమిషాలకి అక్కడికి భారీ సంఖ్యలో ప్రజలు చేరాలని బోర్డర్ ఏరియా డెవలప్మెంట్ ఫ్రంట్ పిలుపునిచ్చింది.
వివరాలు
బీటింగ్ రిట్రీట్ - 1959 నుంచీ కొనసాగుతున్న సంప్రదాయం
అత్తారి బోర్డర్ వద్ద బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని 1959 నుండి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భారత్, పాకిస్థాన్ జాతీయ పతాకాలను సాయంత్రం అవనతనం చేస్తారు. సాధారణంగా దీపావళి, ఈద్, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్య్ర దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భాల్లో ఇరు దేశాల సైనికులు పరస్పరంగా స్వీట్లు పంచుకుంటారు. అత్తారి-వాఘా బోర్డర్, అమృత్‌సర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో, లాహోర్‌కు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ జరిగే బీటింగ్ రిట్రీట్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు 25 వేల మంది సామర్థ్యం ఉన్న విశాలమైన గ్యాలరీ కూడా ఉంది.