Viral Video: హెల్మెట్ లేదని బండి ఆపితే.. ఏకంగా ట్రాఫిక్ పోలీసు వేలు కొరికేశాడు
బెంగళూరులో హెల్మెట్ లేకుండా స్కూటీ నడుపుతున్న వ్యక్తి బండిని ఆపిన ట్రాఫిక్ పోలీసుల పై వ్యక్తి రెచ్చిపోయాడు.ఏకంగా ఓ పోలీసు వేలు కొరికాడు. ఈ ఘటన బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో బాగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. సయ్యద్ షఫీ(28) బెంగుళూరులోని విల్సన్ గార్డెన్ 10వ క్రాస్ సమీపంలో హెల్మెట్ లేకుండా స్కూటీని డ్రైవింగ్ చేస్తున్నాడు. సయ్యద్ షఫీచూసిన ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు అతడిని అడ్డుకున్నారు.
సయ్యద్ షఫీపై క్రిమినల్ కేసు
ఇద్దరు ట్రాఫిక్ పోలీసులలో ఒకరి షఫీ బండి కీని తీసుకోగా,అతను పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దాంతో హెడ్ కానిస్టేబుల్ ఈ ఘటనను రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. ఇద్దరు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం ప్రారంభించాడు షఫీ. ఓ దశలో కీని తీసేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వేలిని కొరికాడు. ట్రాఫిక్ పోలీస్ వేలు కొరికిన సయ్యద్ సఫీ అక్కడి నుండి పారిపోయేందుకు ప్రయత్నించాడు. సయ్యద్ షఫీని వెంటనే అరెస్ట్ చేసి, అతనిపై క్రిమినల్ కేసు పెట్టారు. ఇందుకు సమందించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.