Page Loader
Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు 
బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు

Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
11:37 am

ఈ వార్తాకథనం ఏంటి

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు ఆనందం కేవలం కొన్ని గంటలపాటు మాత్రమే నిలిచింది. ఆటగాళ్లను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో తీవ్ర తొక్కిసలాట (Bengaluru Stampede) చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ విషయంపై విచారణ చేపట్టనున్నట్లు సమాచారం. కాగా, నిన్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ దుర్ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. అదనంగా, ఈ తొక్కిసలాటలో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బెంగళూరు తొక్కిసలాట ఘటనను సుమోటోగా విచారణకు స్వీకరించిన కర్ణాటక హైకోర్టు